Updated : 23 May 2022 06:58 IST

Cinema News: పా రంజిత్‌ ‘వెట్టువమ్‌’

‘కబాలి  రా..’ అని రజనీ కాంత్‌తో చెప్పించి అందరి దృష్టినీ తన వైపు తిప్పుకొన్న దర్శకుడు ‘పా రంజిత్‌’. ప్రస్తుతం కేన్స్‌ చిత్రోత్సవానికి వెళ్లిన ఈ దర్శకుడు తన భవిష్యత్తు చిత్రం ‘వెట్టువమ్‌’ పోస్టర్‌ను విడుదల చేశాడు. ‘వెట్టువమ్‌’ను సినిమాగానే కాకుండా సిరీస్‌గానూ రూపొందించనున్నారు. మొదటగా సినిమా 2023లో విడుదల చేయడానికి ప్రయత్నించనున్నారు. పేదల పక్షాన ఉంటూ వారి న్యాయం కోసం పోరాడే రాబిన్‌ హుడ్‌ తరహా కథగా ‘వెట్టువమ్‌’ తెరకెక్కనుంది. రంజిత్‌ దర్శకత్వంలో విక్రమ్‌ హీరోగా ఓ సినిమా ఖరారైన విషయం తెలిసిందే. ‘చియాన్‌ 61’ వర్కింగ్‌ టైటిల్‌తో దీని చిత్రీకరణ జులై నుంచి ప్రారంభం కానుంది.

Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని