తెలుగులోనూ ఫహద్‌ ఫాజిల్‌ ‘పంచువమ్‌ అద్భుత విళక్కుమ్‌’

ఫహద్ ఫాజిల్‌ (Fahadh Faasil) కథానాయకుడిగా అఖిల్‌ సత్యన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘పంచువమ్‌ అద్భుత విళక్కుమ్‌’ (Pachuvum Athbutha Vilakkum) అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది.

Published : 23 May 2023 16:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మరో మలయాళ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఫహద్ ఫాజిల్‌ (Fahadh Faasil) కథానాయకుడిగా అఖిల్‌ సత్యన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్‌ ‘పంచువమ్‌ అద్భుత విళక్కుమ్‌’ (Pachuvum Athbutha Vilakkum). అంజన జయప్రకాష్‌, ధవని రాజేశ్‌, విజ్జి వెంకటేశ్‌ కీలక పాత్రలు పోషించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే అందుకుంది. కమర్షియల్‌గా విజయం సాధించిన ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా మే 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. మలయాళంతో పాటు, తమిళ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్‌ కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని