స్టూడియో చూపించడానికి వెళ్తే.. నటుడయ్యారు

హాస్య నటుడు పద్మనాభం ‘రేఖా అండ్‌ మురళీ ఆర్ట్స్‌’ నాటక సంస్థను స్థాపించి ‘శాంతి నివాసం’ నాటకాన్ని ప్రదర్శిస్తున్న రోజులవి. ఓ రోజు

Published : 28 Mar 2021 16:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: హాస్య నటుడు పద్మనాభం ‘రేఖా అండ్‌ మురళీ ఆర్ట్స్‌’ నాటక సంస్థను స్థాపించి ‘శాంతి నివాసం’ నాటకాన్ని ప్రదర్శిస్తున్న రోజులవి. ఓ రోజు మద్రాసుకు వచ్చిన డ్రామా కాంట్రాక్టర్లకు సినిమా స్టూడియోలు చూపిస్తూ వాహినీలోకి అడుగుపెట్టారాయన.

అదే సమయంలో అక్కడ ‘వెలుగు నీడలు’లో ఏయన్నార్‌ మిత్రబృందం పాడే ‘భలే భలే మంచి రోజులులే..’ పాట చిత్రీకరణ జరుగుతోంది. అందులో నటిస్తున్న హాస్యనటుడు సారథి వరసగా టేకులు తినడంతో నిర్మాత దుక్కిపాటికి విసుగెత్తింది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పద్మనాభంని చూస్తూనే ‘నువ్విప్పుడు వేసుకున్న డ్రెస్‌ బాగుంది. వెంటనే మేకప్‌ చేయించుకో’ అంటూ సారథి పాత్రలో పద్మనాభాన్ని తీసున్నారు.

‘కర్నూలు ఎక్కడ, కాకినాడ ఎక్కడ...’ అంటూ ఆరంభమయ్యే సాకీని ఆయన మీద చిత్రించారు. అది ఆయనకు గుర్తింపును తీసుకొచ్చింది. చలనచిత్ర హాస్యనట జీవితానికి గట్టి పునాదులు వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని