Gopi Chandh: అందాల రాశీ అనబోతున్న ‘పక్కా కమర్షియల్‌’ ఎప్పుడంటే..

గోపిచంద్‌, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్‌’. ఈ కామెడీ-యాక్షన్‌ సినిమాను మారుతి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం జులై1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Published : 26 May 2022 13:21 IST

ఇంటర్‌నెట్‌డెస్క్‌: గోపిచంద్‌, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్న సినిమా ‘పక్కా కమర్షియల్‌’. ఈ కామెడీ-యాక్షన్‌ సినిమాను మారుతి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం జులై1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాలోని అందాల రాశీ.. అనే పాటను జూన్‌1న విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇక ఈ చిత్రం టీజర్‌ మంచి ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన టైటిల్‌ సాంగ్‌ కూడా అందరినీ ఆకట్టుకుంది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సత్యరాజ్‌ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో నాయకానాయికలు న్యాయవాదులుగా నటిస్తున్నారు. బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాకు అల్లు అరవింద్‌ సమర్పకులు. రావురమేశ్‌, సప్తగిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని