Updated : 02 Aug 2022 13:21 IST

Pakka Commercial: అల్లు అరవింద్‌తో మాట్లాడి వెబ్‌సిరీస్‌లో అవకాశం ఇప్పిస్తా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: గోపీచంద్‌ (Gopichand) హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కించిన చిత్రం ‘పక్కా కమర్షియల్‌’ (Pakka Commercial). జులై 1న థియేటర్లలో విడుదలై సందడి చేసిన ఈ సినిమా అతి త్వరలోనే ఓటీటీలోకి రాబోతోంది. ‘ఆహా’లో (Aha) ఆగస్టు 5 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ సందర్భంగా ఆహా ఇందుకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసింది.. యాక్షన్- కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో గోపీచంద్‌, కథానాయిక రాశీఖన్నా (Raashi Khanna) లాయర్లుగా నటించారు. ‘అవసరమైతే అల్లు అరవింద్‌గారితో మాట్లాడి, ఆహాలో ఓ వెబ్‌సిరీస్‌లో యాక్ట్‌ చేసే అవకాశం ఇప్పిస్తా. కానీ, ఐ కాంట్‌ హ్యాండిల్‌ దిస్‌’ అంటూ గోపిచంద్‌ చెప్పే డైలాగ్‌లు అలరిస్తున్నాయి. సత్యరాజ్‌, రావు రమేష్‌, అజయ్‌ ఘోష్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని