Pakka Commercial: ‘పక్కా కమర్షియల్‌’ టీమ్‌పై బిత్తిరి సత్తి అసహనం..!

గోపీచంద్‌, రాశీఖన్నా జంటగా నటించిన కామెడీ, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘పక్కా కమర్షియల్‌’. మారుతి దర్శకుడు. జులై 1న ప్రేక్షకుల ముందుకు రానున్న....

Published : 19 Jun 2022 01:36 IST

తారక్‌, మహేశ్‌లతో ఇంటర్వ్యూ చేశా

హైదరాబాద్‌: గోపీచంద్‌, రాశీఖన్నా జంటగా నటించిన కామెడీ, కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ ‘పక్కా కమర్షియల్‌’. మారుతి దర్శకుడు. జులై 1న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ని చిత్రబృందం షురూ చేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే రాశీఖన్నా, గోపీచంద్‌ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. కాగా, తాజాగా రాశీ, గోపీచంద్‌, మారుతి.. బిత్తిరి సత్తితో ఓ ఫన్నీ ఇంటర్వ్యూ చేశారు. ఫన్‌ ఫుల్‌గా సాగిన ఈ ఇంటర్వ్యూ వీడియోని చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ నెట్టింట షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. బిత్తిరిసత్తి మాటలు.. టీమ్‌ వేసిన పంచులు.. మెప్పించేలా ఉన్నాయని చెప్పుకుంటున్నారు.

ఇదిలా ఉండగా, ఇంటర్వ్యూ చేయడానికి ముందు బిత్తిరిసత్తి టీమ్‌ కోసం వెయిట్‌ చేస్తుండగా ‘‘అన్నా.. సర్‌ వాళ్లందరూ వచ్చారు. మారుతి సర్‌ కూడా వచ్చారు’’ అని ఓ వ్యక్తి వచ్చి చెప్పగానే.. ‘‘కొంచెంసేపు ఆగాక వస్తాను. రాజమౌళి, తారక్‌, మహేశ్‌బాబులనే నేను ఇంటర్వ్యూ చేశాను. చూశావా నా ఇంటర్వ్యూలు ఫుల్‌ ట్రెండింగ్‌లోకి వెళ్తున్నాయి. ఇంటర్వ్యూలకు కూడా సబ్‌టైటిల్స్‌ వేస్తే హిందీలోనూ సూపర్‌హిట్‌ అవుతాయి. ఇంటర్వ్యూ చేయడానికి వస్తే బిస్కెట్లు, టీ కూడా పెట్టలేదు. సినిమా టైటిల్‌కు తగ్గట్టే కమర్షియల్‌గా ఉన్నారుగా’’ అంటూ అసహనం వ్యక్తం చేసినట్లు సరదాగా చూపించారు. సత్తి అన్న మాటలు తెలుసుకున్న మారుతి.. ‘‘ఇందాక నువ్వు వేసిన డైలాగ్స్‌.. అదేవిధంగా మళ్లీ చెబితే సినిమాలో రోల్‌ ఇస్తాను’’ అని చెప్పడం.. అది విని సత్తి.. ‘‘అతను మీతో మొత్తం చెప్పేశాడా సర్‌? నేను కేవలం మామూలుగానే అన్నాను. నాకేం తెలుసు మీరు మొత్తం సీసీ కెమెరాల్లో చూశారని’’ అని సమాధానమివ్వడం ఎంతో ఫన్నీగా అనిపించింది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని