Pakka Commercial: కామెడీ- యాక్షన్‌ ప్యాకేజీగా ‘పక్కా కమర్షియల్‌’ రిలీజ్‌ ట్రైలర్‌..!

‘ఇది నిజం.. జయం.. మై డార్లింగ్‌ వర్షం’ అంటూ గోపీచంద్‌ వినోదాన్ని పంచుతున్నారు. మరో వైపు, ‘నోట్లో పాన్‌ ఏసుకుని, షర్ట్‌ మడతపెట్టి దిగితే’ అంటూ తన స్టామినానూ చూపిస్తున్నారు.

Published : 29 Jun 2022 21:31 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఇది నిజం.. జయం.. మై డార్లింగ్‌ వర్షం’ అంటూ గోపీచంద్‌ (Gopichand) వినోదాన్ని పంచుతున్నారు. మరో వైపు, ‘నోట్లో పాన్‌ వేసుకుని, షర్ట్‌ మడతపెట్టి దిగితే’ అంటూ తన స్టామినానూ చూపిస్తున్నారు. ‘డోంట్‌వర్రీ బాసూ’ అంటూ హుషారెత్తించే ‘పక్కా కమర్షియల్‌’ (Pakka Commercial) రిలీజ్‌ ట్రైలర్‌తో ఆయన సందడి చేస్తున్నారు. ఈయన హీరోగా దర్శకుడు మారుతి (Maruthi) తెరకెక్కించిన చిత్రమిది. రాశీఖన్నా కథానాయిక. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, సత్యరాజ్‌, రావు రమేశ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం జులై 1న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఇప్పటికే ఓ ట్రైలర్‌ను పంచుకున్న చిత్ర బృందం తాజాగా ‘రిలీజ్‌ ట్రైలర్‌’ను విడుదల చేసింది. ఇందులో.. గోపీచంద్‌ చెప్పిన సంభాషణలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. టైటిల్‌కు తగ్గట్టు కమర్షియల్‌ హంగులు ఈ సినిమాలో పక్కాగా ఉన్నట్టు ట్రైలర్‌ చూస్తే అనిపిస్తోంది. ఈ చిత్రంలో గోపీచంద్‌, రాశీఖన్నా లాయర్లుగా కనిపించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని