Pakka Commercial: టికెట్‌ ధరలు పెంచేస్తే.. దెబ్బతింటాం

‘‘ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఆన్‌లైన్‌ టికెటింగ్‌ పోర్టల్‌పై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు ఎన్నో సందేహాలున్నాయి. కాబట్టి వీరితో చర్చించి, సందేశాలు నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ఓ సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందనిపిస్తోంది’’ అన్నారు నిర్మాత బన్నీ వాస్‌. ఇప్పుడాయన నిర్మా

Updated : 29 Jun 2022 11:32 IST

‘‘ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకొస్తున్న ఆన్‌లైన్‌ టికెటింగ్‌ పోర్టల్‌పై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు ఎన్నో సందేహాలున్నాయి. కాబట్టి వీరితో చర్చించి, సందేశాలు నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ఓ సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుందనిపిస్తోంది’’ అన్నారు నిర్మాత బన్నీ వాస్‌ (Bunny Vasu). ఇప్పుడాయన నిర్మాణంలో గోపీచంద్‌ (Gopichand) హీరోగా నటించిన చిత్రం ‘పక్కా కమర్షియల్‌’ (Pakka Commercial). మారుతి(Maruthi) తెరకెక్కించారు. రాశి ఖన్నా(Rashi Khanna) కథానాయిక. ఈ సినిమా జులై 1న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాస్‌ మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్‌కాపీ సిద్ధమయ్యాక.. కొవిడ్‌ పరిస్థితుల వల్ల సినిమాని ఎనిమిది నెలలు ఆపుకోవాల్సి వచ్చింది. దాని వల్ల మాకు వడ్డీల భారం పెరిగిపోయింది. అయితే, గోపీచంద్‌ - మారుతిలకు హిందీ డబ్బింగ్‌పై ఉన్న పట్టు వల్ల.. ఈ చిత్రం థియేటర్లలో మినిమం ఆడేసినా మేము బయట పడే పరిస్థితుల్లో ఉన్నాం. చిత్ర సీమలో కొవిడ్‌ తర్వాత పబ్లిసిటీ ఖర్చులు పెరిగాయి. వసూళ్లు తగ్గాయి. సినిమా స్థాయి, బడ్జెట్లను దృష్టిలో పెట్టుకునే టికెట్‌ ధరలు ఖరారు చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం టికెట్‌ ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చింది కదాని.. ఇష్టారీతిన ధరలు పెంచేస్తే పూర్తిగా దెబ్బతింటాం. మా ‘పక్కా కమర్షియల్‌’ చిత్ర విషయంలో టికెట్‌ ధరలు అందరికీ అందుబాటులో ఉండేలా ఖరారు చేశాం. ఇది ఇప్పట్లో ఓటీటీకి రాదు. కొత్త సినిమాలు త్వరగా ఓటీటీలోకి రావడం వల్ల ఇటు థియేటర్‌ వ్యవస్థ.. అటు పెద్ద హీరోలు తీవ్ర నష్టాలు ఎదుర్కోవల్సి రావొచ్ఛు ప్రస్తుతం ఈ ఓటీటీ విడుదలలపై నిర్మాతల్లో చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. ‘‘ఏ వ్యవస్థలోనైనా కమర్షియాలిటీ ఉండొచ్చు కానీ, న్యాయ వ్యవస్థలో ఉండకూడదు అనే విషయాన్ని ఈ చిత్రంలో వినోదాత్మకంగా చెప్పాం. రెండున్నర గంటలు ప్రేక్షకుల్ని హాయిగా నవ్వించే చిత్రమిది’’ అన్నారు దర్శకుడు మారుతి (Maruthi).


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని