Pakka Commercial: సిరివెన్నెల మార్క్‌.. ఆకట్టుకునేలా ‘పక్కా కమర్షియల్‌’ టైటిల్ ట్రాక్‌

‘చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది’ అంటూ మనీ గురించి దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పిన జీవిత సత్యాన్ని ఎవరూ మరిచిపోలేరు.

Updated : 07 Dec 2022 21:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకి బంధువవుతానని అంది’ అంటూ మనీ (డబ్బు) గురించి దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పిన జీవిత సత్యాన్ని ఎవరూ మరిచిపోలేరు. ‘పక్కా కమర్షియల్‌’ సినిమా కోసం మరోసారి ఆయన అలాంటి ప్రయత్నం చేశారు. ఆయన ఆఖరి రోజుల్లో రాసిన పాట ఇది. సోషల్‌ మీడియా వేదికగా బుధవారం విడుదలైంది. గాలి, నీరు, నిప్పు, నేల ఏదీ ఉచితం కాదంటూ సాగే ఈ గీతం అన్ని వర్గాల శ్రోతల్ని ఆకట్టుకునేలా ఉంది. జన్మించినా.. మరణించినా ఖర్చేనని, వ్యవహారాలన్నీ వ్యాపారాలేనని, ప్రతిదీ ‘కమర్షియలే’ అంటూ సిరివెన్నెల తనదైన మార్క్‌ చూపించారు. ఈ టైటిల్‌ ట్రాక్‌ను స్వీయ సంగీత దర్శకత్వంలో జాక్స్‌ బెజోయ్‌.. హేమచంద్రతో కలిసి ఆలపించారు.

గోపీచంద్‌, రాశిఖన్నా జంటగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ యాక్షన్- కామెడీ సినిమాలో నాయకానాయికలు న్యాయవాదులుగా నటిస్తున్నారు. బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమా మే 20 విడుదలకానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని