Palasa 1978: ‘పలాస’ కు అరుదైన గౌరవం

చెన్నైలో ఈ నెల 9 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న  పి.కె రోజ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ‘పలాస 1978’ చిత్రం ఎంపికైనట్లు ఆ చిత్ర దర్శకుడు కరుణ కుమార్‌ ప్రకటించారు. ఒక మంచి ప్రయత్నంతో వస్తే ప్రేక్షకులు సినిమాను ఎంత బాగా ఆదరిస్తారో 

Updated : 07 Apr 2022 12:08 IST

చెన్నైలో ఈ నెల 9 నుంచి మూడు రోజుల పాటు జరగనున్న  పి.కె రోజ్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు ‘పలాస 1978’ చిత్రం ఎంపికైనట్లు ఆ చిత్ర దర్శకుడు కరుణ కుమార్‌ ప్రకటించారు. ఒక మంచి ప్రయత్నంతో వస్తే ప్రేక్షకులు సినిమాను ఎంత బాగా ఆదరిస్తారో  చెప్పడానికి ఈ సినిమానే ఉదాహరణ అని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి వేదికపై తన సినిమా ప్రదర్శితమవుతున్నందుకు గర్వంగా ఉందని తెలిపారు. దళిత ఇతివృత్తాలతో వచ్చిన సినిమాలను వెలుగులోకి తీసుకువచ్చే ఉద్దేశంతో తమిళ దర్శకుడు పా రంజిత్‌ 2018లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు