Panchathantram: ఐదు కథలు.. విభిన్నమైన భావోద్వేగాలు

ఐదు జంటలు.. ఒకొక్కరిది ఒక్కో రకమైన ప్రయాణం.. మరి ఆ కథలన్నీ ఎలా ముగిశాయో తెలియాలంటే ‘పంచతంత్రం’ చూడాల్సిందే. హర్ష పులిపాక తెరకెక్కించిన చిత్రమిది.

Updated : 27 Nov 2022 06:59 IST

దు జంటలు.. ఒకొక్కరిది ఒక్కో రకమైన ప్రయాణం.. మరి ఆ కథలన్నీ ఎలా ముగిశాయో తెలియాలంటే ‘పంచతంత్రం’ (Panchathantram) చూడాల్సిందే. హర్ష పులిపాక తెరకెక్కించిన చిత్రమిది. బ్రహ్మానందం (Brahmanandam), స్వాతి రెడ్డి (Swathi Reddy), సముద్రఖని (Samuthirakhani), రాహుల్‌ విజయ్‌, శివాత్మిక రాజశేఖర్‌, నరేష్‌ అగస్త్య తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా డిసెంబరు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం నటి రష్మిక చిత్ర ట్రైలర్‌ విడుదల చేశారు. ఐదు కథలు.. విభిన్నమైన భావోద్వేగాల సమాహారంగా ఈ చిత్రం రూపొందింది. బ్రహ్మానందం ఈ ఐదు కథలకు పంచేంద్రియాలు అని పేరు పెట్టి తనదైన కోణంలో వివరిస్తూ వెళ్లడం ట్రైలర్‌ ప్రారంభంలో కనిపిస్తుంది. ప్రచార చిత్రంలో ఐదు జంటల జీవన ప్రయాణాన్ని ఆహ్లాదభరితంగా చూపించారు. ‘‘నీ జీవితం ఎంత ముఖ్యమనుకుంటావో.. నీతో లైఫ్‌ పంచుకునే వాళ్ల జీవితం కూడా అంతే ముఖ్యం అనుకున్నప్పుడు.. సర్దుకుపోవడాల్లో ఉన్న విలువ తెలుస్తుంది’’ అంటూ ట్రైలర్‌లో వినిపించిన డైలాగ్‌ ఆలోచింపజేసేలా ఉంది. ఈ సినిమాకి సంగీతం: ప్రశాంత్‌ ఆర్‌.విహారి, కూర్పు: గ్యారీ బి.హెచ్‌, ఛాయాగ్రహణం: రాజ్‌ కె.నల్లి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు