‘పాప ఓ పాప’ వచ్చేసింది..!

రాజేంద్రప్రసాద్‌, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గాలి సంపత్‌’. అనీశ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘గాలి సంపత్‌’ నుంచి ‘పాప ఓ పాప’ అంటూ సాగే ఓ వీడియో...

Published : 05 Mar 2021 13:57 IST

‘గాలిసంపత్‌’ నుంచి మరో వీడియో సాంగ్‌

హైదరాబాద్‌: రాజేంద్రప్రసాద్‌, శ్రీవిష్ణు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘గాలి సంపత్‌’. అనీశ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘గాలి సంపత్‌’ నుంచి ‘పాప ఓ పాప’ అంటూ సాగే ఓ వీడియో సాంగ్‌ను శుక్రవారం చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణతోపాటు మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. తండ్రీకొడుకుల మధ్య అనుబంధాన్ని చూపించే ఆసక్తికరమైన కథతో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో నటి లవ్లీ సింగ్‌ కథానాయికగా కనిపించనున్నారు. అచ్చు స్వరాలు అందిస్తున్నారు. తణికెళ్ల భరణి కీలకపాత్రలో కనిపించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని