Updated : 19 May 2022 06:59 IST

Parasuram: కొత్త మహేష్‌ని చూశామన్నారు

‘‘ప్రేక్షకులకు ఆహ్లాదం పంచుతూ... వాళ్లని నవ్విస్తూనే చెప్పాలనుకున్నది చెప్పడం నాకు ఇష్టమైన శైలి. ‘సర్కారు వారి పాట’తోనూ అదే ప్రయత్నం చేశా. ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూస్తుండటానికి కారణం అదే’’ అన్నారు పరశురామ్‌. ఆయన దర్శకత్వంలో మహేష్‌బాబు కథానాయకుడిగా తెర  కెక్కిన ‘సర్కారు వారి పాట’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ ప్రయాణం గురించి పరశురామ్‌ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. ‘‘ప్రతి సినిమానీ బాధ్యతతో చేయాల్సిందే. స్టార్లతో సినిమాకీ, మిగతా చిత్రాలకు పని పరంగా తేడా అంటూ ఏమీ ఉండదు. స్టార్‌ కథానాయకులతో సినిమా అన్నప్పుడు ప్రేక్షకుల్లో దాని పరిధి విస్తృతంగా ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకుని రచన, విజువల్‌ పరంగా వాటి స్థాయి, పరిధిని పెంచాలి. మహేష్‌బాబుతో కమర్షియల్‌ ఫార్ములాలో కాకుండా నాదైన శైలిలోనే సినిమా చేయాలనుకున్నా. ఇలాంటి కథతో గతంలో సినిమా రాలేదు. అదే ప్రేక్షకుల్ని మెప్పిస్తోంది. ‘నేనైతే ఇంత బలమైన కథని అంత సున్నితంగా చెప్పలేను. ఇది నీ  ఒక్కడికే సాధ్యం’ అని మెచ్చుకున్నారు దర్శకుడు సుకుమార్‌. హరీష్‌శంకర్‌, పూరిజగన్నాథ్‌... ఇలా చాలా మంది దర్శకులు ఫోన్‌ చేసి అభినందించారు. మహేష్‌ అభిమానులకైతే ఆయన పాత్రని డిజైన్‌ చేసిన విధానం   మొదలుకొని, ఆయన లుక్‌, సంభాషణలు చెప్పడం వరకు ప్రతిదీ నచ్చింది. కొత్త మహేష్‌ని చూశామని చెప్పారు. విడుదల తర్వాత ఆయనే ఫోన్‌ చేసి కంగ్రాట్స్‌ చెప్పార’’న్నారు పరశురామ్‌. తదుపరి చేయనున్న సినిమా కోసం స్క్రిప్టు సిద్ధమైందని తెలిపారాయన. నాగచైతన్య కోసం ‘నాగేశ్వరరావు’ పేరుతో స్క్రిప్ట్‌ రాశానని, త్వరలోనే ఆ చిత్రాన్ని పట్టాలెక్కిస్తామన్నారు.


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని