Paresh Rawal: క్షమించండి.. కేవలం నిద్రపోయా!!

దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం విజృంభిస్తోన్న వేళ సోషల్‌మీడియాలో ఫేక్‌ న్యూస్‌లు సైతం చక్కర్లు కొడుతున్నాయి. సోషల్‌మీడియా ఓపెన్‌ చేస్తే ఓ వైపు కరోనా వైరస్‌ మరోవైపు సెలబ్రిటీల ఆరోగ్య పరిస్థితులు గురించి వచ్చే వార్తలు క్యూ కడుతున్నాయి....

Updated : 15 May 2021 14:03 IST

ఫేక్‌ న్యూస్‌పై నటుడి సెటైర్‌

ముంబయి: దేశవ్యాప్తంగా కరోనా కల్లోలం విజృంభిస్తోన్న వేళ సోషల్‌మీడియాలో ఫేక్‌ న్యూస్‌లు సైతం చక్కర్లు కొడుతున్నాయి. సోషల్‌మీడియా ఓపెన్‌ చేస్తే ఓ వైపు కరోనా వైరస్‌, మరోవైపు సెలబ్రిటీల ఆరోగ్య పరిస్థితులు గురించి ఎక్కువగా వార్తలు కనబడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు పరేశ్‌ రావల్‌ కన్నుమూసినట్లు శుక్రవారం ఉదయం నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న ఆయన అనారోగ్యం కారణంగా నిన్న ఉదయం ఏడు గంటలకు కన్నుమూశారని వార్తలు దర్శనమిచ్చాయి. అయితే వీటిపై పరేశ్‌ రావల్‌ సెటైరికల్‌గా స్పందించారు. ‘క్షమించండి.. మీరు చెబుతున్నట్లు ఏడు గంటల సమయంలో నేను నిద్రలో ఉన్నా. శాశ్వత నిద్రలో కాదు’ అని పోస్ట్‌ పెట్టారు.

బాలీవుడ్‌లో తెరకెక్కిన ఎన్నో చిత్రాల్లో పరేశ్‌ రావల్‌.. ప్రతినాయకుడిగా, సహాయనటుడిగా నటించి మెప్పించారు. ‘మనీ’తో ఆయన నటుడిగా తెలుగు తెరపై మెరిశారు. ‘గోవిందా గోవిందా’, ‘మనీ మనీ’, ‘బావగారు బాగున్నారా’, వంటి సినిమాలతో ఆకట్టుకున్నారు. ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’తో లింగం మావయ్యగా పరేశ్‌ తెలుగువారికి మరింత చేరువయ్యారు. మరోవైపు మార్చి నెలలో ఆయన కొవిడ్‌-19 బారినపడ్డారు. ఈవిషయాన్ని తెలియజేస్తూ అప్పట్లో ట్వీట్‌ పెట్టారు. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉండి.. వైద్యుల సూచనలు పాటించి కరోనా నుంచి కోలుకున్నట్లు ఏప్రిల్‌లో ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని