Parineeti Chopra: నిశ్చితార్థం తర్వాత అభిమానులకు పరిణీతి ఎమోషనల్‌ లెటర్‌

నిశ్చితార్థం తర్వాత పరిణీతి చోప్రా (Parineeti Chopra) హృదయపూర్వక లేఖ రాసింది. వారిపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపింది.

Updated : 15 May 2023 17:55 IST

హైదరాబాద్‌: కొన్ని నెలల నుంచి వస్తోన్న రూమర్స్‌కు ఫుల్‌స్టాప్‌ పెడుతూ బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) నేత, ఎంపీ రాఘవ్‌ చద్దా (Raghav Chadha)ల నిశ్చితార్థం జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇక నిశ్చితార్థం తర్వాత నేడు పరిణీతి చోప్రా తన అభిమానుల కోసం సోషల్‌ మీడియాలో ఓ నోట్‌ను షేర్‌ చేశారు. అందులో తన మనసులోని మాటల్ని రాసుకొచ్చారామె.

కొన్ని రోజులుగా మీరంతా మాపై చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా నిశ్చితార్థం సందర్భంగా మీరంతా మాపై చూపించిన ప్రేమాభిమానాలు ఎప్పటికీ మర్చిపోలేం. మేమిద్దరం వేర్వేరు ప్రపంచాల నుంచి వచ్చాం. ఇప్పుడు మా ఇద్దరి ప్రపంచం ఒక్కటైపోయింది. మేము ఊహించనంత పెద్ద కుటుంబాన్ని పొందాం. మీరు పంపిన శుభాకాంక్షలన్నిటికీ ఎంతో సంతోషంగా ఉంది. అవి మా మనసుకు హత్తుకున్నాయి. మీ అందరి ఆశీర్వాదంతో మేము కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నాం. మీడియా వాళ్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. రోజంతా మాతో ఉండి మాలో ఉత్సాహాన్ని నింపారు

- పరిణీతి చోప్రా

ఈ వేడుకకు హజరైన సినీ ప్రముఖులందరికీ పరిణీతి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఇక రాఘవ్‌ చద్దా కూడా దిల్లీ ముఖ్యమంత్రి, AAP అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు ట్విటర్‌ వేదికగా కృతజ్ఞతలు చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు