Parineeti Chopra: వ్యక్తిగత జీవితాల్లోకి రావడం అమర్యాదే: ఎంపీతో డేటింగ్‌ వార్తలపై పరిణీతి

ఎంపీ రాఘవ చద్దాతో డేటింగ్‌ వార్తలు నిజమైతే ఎలాంటి అపార్థాలకు తావులేకుండా స్పష్టత ఇస్తానని కథానాయిక పరిణీతి చోప్రా అన్నారు.

Published : 18 Apr 2023 20:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బాలీవుడ్‌ కథానాయిక పరిణీతి చోప్రా (Parineeti Chopra), ఆప్‌ నాయకుడు, ఎంపీ రాఘవ చద్దా(Raghav Chadha) గత కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారన్న వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ ఇరువురూ ఈ వార్తలపై స్పందించలేదు. అయితే, ఇటీవల జరిగిన కొన్ని కార్యక్రమాలకు ఇద్దరూ కలిసి హాజరవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరుస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పరిణీతి తమపై వస్తున్న రూమర్స్‌పై వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒకవేళ అదే నిజమైతే (రాఘవతో డేటింగ్‌) ఎలాంటి అపార్థాలకు తావూ లేకుండా స్పష్టత ఇస్తానని చెప్పారు. ఒకవేళ విషయాన్ని చెప్పాల్సిన అవసరం లేకపోతే తాను చెప్పనని కూడా అన్నారు.

‘‘గుర్తింపు, ప్రేమ, ఆమోదం వీటిని విజయంగా భావిస్తాం. ఒకవేళ నేనెవరో ఎవరికీ తెలియకపోతే, నా విషయాలపై వాళ్లకు(మీడియా) ఆసక్తి లేకపోతే ఒక నటిగా నేను సాధించాలనుకున్నది సాధించలేదని అర్థం. ఎందుకంటే సక్సెస్‌ఫుల్‌ నటులు ఎప్పుడూ ఫేమసే. ప్రతి ఇంట్లోనూ మన గురించే చర్చ. వార్తా పత్రికలు, న్యూస్‌ ఛానెళ్లు,, డిజిటల్‌ మీడియా, పాపరాజి కల్చర్‌ (సెలబ్రిటీలను వీడియోలు, ఫొటోలు తీసే ఫ్రీలాన్సర్స్‌) అంతటా మనమే. (వ్యంగ్యంగా...) నా జీవితాన్ని చర్చకు పెట్టే విషయంలో సన్నని గీత అనేది వాళ్లు గుర్తించాలి. దాని దాటి మరీ వ్యక్తిగత జీవితంలోకి చొరబడితే కొన్ని సందర్భాల్లో నిజంగా అది అమర్యాదకరమే’’ అని మీడియాకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది.

ఇటీవల పరిణీతి వరుసగా పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తరచూ ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో కనిపిస్తున్న వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. దీనిపైన కూడా పరిణీతి మాట్లాడారు. తానెప్పుడూ పనే జీవితం.. జీవితమే పనిగా బతకనని అన్నారు. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నాని పరిణీతి చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని