డేట్‌కి వెళ్లలేదు: పరిణీతి చోప్రా
బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’. రిభూ దాస్‌గుప్తా దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ప్రమోషన్లో...
ముంబయి: బాలీవుడ్ ముద్దుగుమ్మ పరిణీతి చోప్రా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ది గర్ల్ ఆన్ ది ట్రైన్’. రిభూ దాస్‌గుప్తా దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ప్రమోషన్లో భాగంగా పరిణీతి చోప్రా తాజాగా ‘డూ యూ రిమెంబర్’ అనే ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు.
ఫస్ట్ కిస్, డేట్ గురించి మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడూ డేట్‌కి వెళ్లలేదు. 18 సంవత్సరాలు వయసు ఉన్నప్పుడు ఒకర్ని ముద్దు పెట్టుకున్నాను. అదే నా తొలిముద్దు.’ అని అన్నారు. చిన్నతనంలో ఉన్నప్పుడు సైఫ్ అలీఖాన్‌ను తాను ఎంతగానో ప్రేమించానని పరిణీతి తెలిపారు. అంతేకాకుండా తాను కథానాయికగా నటించిన తొలి సినిమా ‘లేడీస్ వర్సెస్ రిక్కీబాల్’ విడుదలైన తర్వాత ఓ అభిమాని నుంచి ఓ స్పెషల్ గిఫ్ట్ తనకి అందిందని.. ఓ పుస్తకం అందులో అన్నీ లేఖలే ఉన్నాయని.. ఆమె తెలిపారు. అంతేకాకుండా ఆ గిఫ్ట్ తనకి ఎంతో ప్రత్యేకంగా అనిపించిందని ఆమె అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్