Parineeti Chopra: దక్షిణాదిలో.. ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌

‘దక్షిణాది సినిమాల్లో నటించాలని నేను ఎంతగా తహతహలాడుతున్నానో మాటల్లో వర్ణించలేను’ అంటోంది బాలీవుడ్‌ కథానాయిక పరిణీతి చోప్రా. దిల్లీలో నిర్వహించిన అజెండా ఆజ్‌తక్‌ 2022 అనే కార్యక్రమంలో ఆమె ఆదివారం ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.

Updated : 12 Dec 2022 07:07 IST

‘దక్షిణాది సినిమాల్లో నటించాలని నేను ఎంతగా తహతహలాడుతున్నానో మాటల్లో వర్ణించలేను’ అంటోంది బాలీవుడ్‌ కథానాయిక పరిణీతి చోప్రా (Parineeti Chopra). దిల్లీలో నిర్వహించిన అజెండా ఆజ్‌తక్‌ 2022 అనే కార్యక్రమంలో ఆమె ఆదివారం ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. ‘నేను సౌత్‌ సినిమాలో నటించడానికి ఎంతలా ఆరాటపడుతున్నానో మీకెవరికీ తెలియదు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ.. ఏ భాష అయినా ఫర్వాలేదు. ఒక మంచి సినిమాలో నటించాలని చాలాకాలంగా ఎదురుచూస్తున్నా. ఒక మంచి దర్శకుడు, సరైన స్క్రిప్ట్‌ కలిస్తే అద్భుతమైన ప్రాజెక్టు బయటికొస్తుంది. అలాంటి అవకాశం నాకు దక్కాలి. దయచేసి మీలో ఎవరికైనా ఒక గొప్ప దర్శకుడి గురించి తెలిస్తే చెప్పండి’ అంటూ ఈ సందర్భంగా తన మనసులోని భావాలు వెల్లడించింది. పరిణీతి ప్రస్తుతం అక్షయ్‌కుమార్‌కి జోడీగా ‘క్యాప్సూల్‌ గిల్‌’ అనే చిత్రంలో నటిస్తోంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని