అలాంటి వాడే భర్తగా కావాలి: కృతిశెట్టి

చేసింది ఒకే ఒక్క సినిమా.. అయినా తన అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది కృతిశెట్టి. కేవలం సినిమా ప్రేక్షకులనే కాదు ఎంతో మంది టాలీవుడ్‌ హీరోలను సైతం ఆకర్షించింది. అందుకే స్టార్‌ హీరోలు సైతం ఆమెతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘ఉప్పెన’లో వైష్ణవ్‌తేజ్‌కు జోడీగా ఈ చిన్నది సందడి చేసింది.

Published : 25 May 2021 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పటి వరకూ చేసింది ఒకే సినిమా. అయితేనేం తన అందం, అభినయంతో కుర్రకారు గుండెల్లో గుబులు రేపింది కృతిశెట్టి. కేవలం సినిమా ప్రేక్షకులనే కాదు ఎంతో మంది టాలీవుడ్‌ హీరోలను ఆకర్షించింది. అందుకే స్టార్‌ హీరోలు సైతం ఆమెతో సినిమా చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘ఉప్పెన’లో వైష్ణవ్‌తేజ్‌కు జోడీగా ఈ చిన్నది సందడి చేసింది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ఆ చిత్రం అటు ప్రేక్షకులను, ఇటు విమర్శకులను సైతం ఆకట్టుకుంది. బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టి పలు రికార్డులు నెలకొల్పింది. అయితే.. సినిమాలో తన ప్రియుడిని కలిసేందుకు ఇంట్లో తండ్రితో తెగ అబద్దాలు చెప్పే బేబమ్మ నిజ జీవితంలో ఎలాంటి వ్యక్తి భర్తగా రావాలని కోరుకుంటుందో చెప్పేసింది.

ఆమెకు అబద్దాలు చెప్పేవారంటే అసలే నచ్చదట. అందుకే ఏ విషయమైనా దాపరికం లేకుండా ముక్కుసూటిగా చెప్పే వ్యక్తి తన జీవితంలోకి వస్తే బాగుంటుందని తన మనసులోని మాట బయటపెట్టేసింది. ఇంకా ఆమె పలు ఆసక్తికరమైన విషయాలు అభిమానులతో పంచుకుంది. మరోవైపు కృతిశెట్టికి ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌ వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే నాని హీరోగా వస్తున్న ‘శ్యామ సింగరాయ్‌’, రామ్‌ పోతినేని హీరోగా సుధీర్‌బాబుతో కలిసి ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలని ఉంది’ చిత్రాల్లో నటించేందుకు కృతి సంతకాలు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని