సుజాత ఎందుకో దిగులుగా ఉండేవారు

ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, న‌టుడు పరుచూరి గోపాల కృష్ణ ‘పరుచూరి పలుకులు’ పేరుతో యూ ట్యూబ్ వేదిక‌గా ఓ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Published : 02 Jun 2021 19:45 IST

ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, న‌టుడు పరుచూరి గోపాల కృష్ణ ‘పరుచూరి పలుకులు’ పేరుతో యూ ట్యూబ్ వేదిక‌గా తన సినీ అనుభవాలను పంచుకుంటున్న సంగ‌తి తెలిసిందే.  సినిమా విశేషాలతో పాటు, ఆ రోజుల్లో  జరిగిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. ఇటీవల నాటి నటి సుజాత గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.

‘‘సుజాత గారు ఎంత గొప్ప ఆర్టిస్టో మీ అంద‌రికీ తెలుసు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కె. బాలచంద‌ర్ ప‌రిచ‌యం చేశారు. త‌ర్వాత దాస‌రి నారాయ‌ణ రావు మంచి పాత్ర‌లు ఇచ్చి ఆమెని మ‌రోస్థాయికి తీసుకెళ్లారు. సుజాత గారంటే  ముందుగా ‘ఏడంతుస్తుల మేడ’ చిత్రం గుర్తొస్తుంది. ఆ త‌ర్వాత ‘చంటి’ గుర్తొస్తుంది. వెంక‌టేశ్ త‌ల్లి పాత్ర‌లో అద్భుతంగా న‌టించారు. మా సినిమాల్లో శార‌ద గారు ఎలా ఉండేవారో దాస‌రి గారి సినిమాల్లో సుజాత అలా ఉండేవారు. ఓ సారి సుజాత గారు నా ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి.. ‘స‌ర్ మీరు ప‌రుచూరి గార‌ని నాకు తెలుసు. అలా కాకుండా మీరు నాకు ఇంకా ఎలాగైనా తెలుసా?  మీరు న‌న్నెప్పుడైనా క‌లిశారా’ అని అడిగారు. వెంట‌నే నేను న‌వ్వి ‘మీరు న‌టించిన మాన‌వుడు మ‌హానీయుడు చిత్రానికి ప‌నిచేశా’ అని చెప్పాను. ‘క్ష‌మించండి.. నేను గుర్తుప‌ట్ట‌లేక‌పోయాను’ అన్నారామె. కెమెరా ముందు ఎంతో చ‌లాకీగా ఉండే ఆవిడ బ‌య‌ట మాత్రం ఎందుకో దిగులుగా క‌నిపించేవారు. ఆమె మ‌ర‌ణించ‌డం (2011లో) దుర‌దృష్టక‌రం. ఇప్పుడు ఉన్న‌ట్లైతే ఇత‌ర న‌టీమ‌ణుల్లా అమ్మ‌మ్మ, బామ్మ పాత్ర‌లు పోషించేవారు’’ అని ఆనాటి విషయాలను గుర్తు చేసుకున్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని