Paruchuri Gopala Krishna: ‘దసరా’.. ఆనాటి దర్శకులు చేయలేని సాహసం ఆ ఒక్క షాట్: పరుచూరి
‘దసరా’ (Dasara) సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పారు ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna).
హైదరాబాద్: నాని (Nani) - కీర్తి సురేశ్ (Keerthy Suresh) జంటగా నటించిన మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దసరా’ (Dasara). శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. మార్చిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. తాజాగా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని చెప్పారు ప్రముఖ సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ (Paruchuri Gopala Krishna). ఇందులో నాని నటన అత్యద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు.
‘‘ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ ఆశ్చర్యపరిచేలా కనిపించారు నాని. సాధారణంగా ఆయన్ని మనం క్యూట్ లుక్‌లో చూస్తాం. అలాంటి నానిని ఈ చిత్రంలో మాస్ లుక్‌లో, మద్యానికి బానిసైన యువకుడిగా కనిపించాడు. తన పెర్ఫార్మెన్స్ నభూతో నభవిష్యతి!. అందుకే ఈ సినిమా విషయంలో ముందు నానినే మెచ్చుకోవాలి. అలాగే హీరో మిత్రుడిగా దీక్షిత్ శెట్టి అదరగొట్టేశారు.
ఇది పూర్తిగా నాని - కీర్తిసురేశ్ సినిమా. ఇందులో అంతర్లీనంగా రామాయణం - మహాభారతం కథలు నడిచాయి. విలన్ ఒక రావణాసురుడి లాంటి వాడు. అందుకే అతడిని చంపేటప్పుడు రావణకాష్ఠాన్ని చూపించారు. సాయికుమార్ పాత్ర చిన్నదే అయినప్పటికీ చక్కగా తీర్చిదిద్దారు. క్లైమాక్స్‌లో అతడు చెప్పే డైలాగ్ విని.. ఇతడే విలనా? అనే సందేహం కూడా ప్రేక్షకులకు వస్తుంది. అలాంటి ఎలిమెంట్ ఆఫ్ ఇంట్రెస్ట్‌ను దర్శకుడు క్రియేట్ చేశాడు.
మరో విచిత్రం ఏమిటంటే.. క్లైమాక్స్‌లో హీరోని అంతం చేయడానికి ఎంతోమంది రౌడీలు వస్తారు. ఆ సమయంలో గ్రామస్థులెవరూ కూడా హీరోకు సాయం చేయరు. కేవలం చూస్తూ నిల్చుంటారు. సమాజంలో ఒక వ్యక్తికి భయపడి పేద ప్రజలు ఎలా బతుకుతారు? అని చెప్పడానికి ఈ సినిమా ఒక నిదర్శనం. నాకు తెలిసినంతవరకూ ఏదో ఒక గ్రామాన్ని చూసి స్ఫూర్తి పొందే వాళ్లు ఇలాంటి సీన్స్ తీశారు. ఆ గ్రామంలో పెత్తందారు చెప్పిందే అక్కడి ప్రజలు వినాలి అనే రూల్స్ ఉంటాయి.
ఇక సూరి (దీక్షిత్ శెట్టి) చనిపోయిన తర్వాత వెన్నెల (కీర్తిసురేశ్)ను వితంతువును చేస్తుంటే.. ధరణి (నాని) అక్కడికి వెళ్లి అదే తాళిని ఆమె మెడలో కడతాడు. ఇదొక అద్భుతమైన షాట్. పాత రోజుల్లో దర్శకులు చేయలేని సాహసం ఇప్పుడున్న వాళ్లు చేస్తున్నారనడానికి నిదర్శనం ఆ షాట్. విలన్ చనిపోయాక కూడా సినిమా మరికొంత సేపు రన్ అవుతుంది. ధరణి ప్రేమను వెన్నెల అంగీకరించిందా? అనే ఆసక్తిని అక్కడ దర్శకుడు క్రియేట్ చేశాడు. అలా చివరి షాట్స్‌లో ఆ ప్రశ్నకు సమాధానం ఇచ్చి ప్రేక్షకులు మనస్ఫూర్తిగా థియేటర్ నుంచి బయటకు వచ్చేలా దర్శకుడు దీన్ని తెరకెక్కించారు. నాని జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఇది. చాలా సన్నివేశాల్లో ఇది నానినేనా? అనే సందేహం వస్తుంది’’ అని పరుచూరి వివరించారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
China: బోయింగ్, ఎయిర్‌బస్‌కు పోటీగా చైనా ప్యాసింజర్ విమానం..!
-
India News
wrestlers Protest: పార్లమెంట్ వైపు దూసుకెళ్లిన రెజ్లర్ల నిర్బంధం.. దిల్లీలో ఉద్రిక్తత!
-
Movies News
Shaakuntalam: ‘కేన్స్’లో శాకుంతలం మెరుపులు.. స్పందించిన సమంత
-
Health News
అశ్లీల చిత్రాలు తరచూ చూస్తున్నారా? అయితే మరోసారి ఆలోచించుకోండి!
-
Movies News
NTR Centenary Celebrations: ఎన్టీఆర్ స్మరణలో సినీ తారలు.. సోషల్‌మీడియాలో పోస్టులు
-
World News
viral news: లైవ్‌లో అతిగా మద్యం తాగి.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మృతి..!