ఆ మహానటులిద్దరి కాంబినేషన్ అద్భుతం: పరుచూరి గోపాలకృష్ణ
తెలుగు చిత్రసీమలో పరుచూరి బ్రదర్స్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. వారిలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ రచయితగా, నటుడిగా రాణించారు. ఆయన ‘పరుచూరి పలుకులు’ పేరుతో సినిమా విశేషాలతో పాటు, ఆ రోజుల్లో జరిగిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా నాటి ప్రముఖ నటుడు రాజనాల గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు చిత్రసీమలో పరుచూరి బ్రదర్స్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. వారిలో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ రచయితగా, నటుడిగా రాణించారు. ఆయన ‘పరుచూరి పలుకులు’ పేరుతో సినిమా విశేషాలతో పాటు, ఆ రోజుల్లో జరిగిన ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటారు. తాజాగా నాటి ప్రముఖ నటుడు రాజనాల గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు.
‘‘ఈ రోజు అలనాటి తారల్లో భాగంగా రాజనాల గారి గురించి చెప్తాను. ఆయనతో జ్ఞాపకాలు చెప్పాలంటే ఒక రాజబాబుగారు, పద్శనాభంగారు ఎలాగైతే చివరిదశలో ఇబ్బంది పడ్డారో అలానే రాజనాల కూడా ఆర్థికంగా ఇబ్బందుల పాలయ్యారు. మేము పాఠశాల చదువు నుంచి డిగ్రీకి వచ్చాక కూడా రాజనాలే విలన్‌గా నటించేవారు. అప్పుడప్పుడు సత్యనారాయణ విలన్‌గా కొన్ని సినిమాల్లో చేసినా, ముఖ్యంగా జానపద సినిమాల్లో అన్నగారు హీరో అయితే కచ్చితంగా రాజనాలే విలన్‌గా ఉండేవారు. ఎంతో అద్భుతమైన కాంబినేషన్ అది. అదే తారాగణంతో ఎన్ని సినిమాలు వచ్చిన బోర్ కొట్టేవి కావు. ముఖ్యంగా ‘బందిపోటు’ చిత్రంలో అద్దం ముందు నటించే ఒక సన్నివేశం ఉంటుంది. అన్నగారు అద్దం అవతలివైపు ఉంటే రాజనాలగారు ఇవతలివైపు ఉండి తనే అన్నగారు అనుకుని భ్రమపడుతూ నటించిన విధానం ఎన్నటికీ మరువలేను. అంత అద్భుతంగా రాజనాల చేశారు. ‘బందిపోటు’ చిత్రం ఒక మ్యూజికల్ క్లాసిక్. ఆ చిత్ర కథను చరిత్ర నుంచి తీసుకుని జానపదంగా మార్చారు. అసలు మూలం ‘గోన గన్నారెడ్డి’ కథ. ఆ చిత్ర రచయిత మహారథి ఇదే కథాంశంతో ‘సింహాసనం’ చిత్రాన్ని రచించారు. అదీ సూపర్‌హిట్టే. ఇటీవల వచ్చిన ‘రుద్రమదేవి’లో గోన గన్నారెడ్డి కథ చూపించాం. ఇదే కథను బాలయ్యబాబుతో చేయాలని అప్పట్లో ప్రయత్నించాం. రాణి రుద్రమదేవిగా శ్రీదేవి నటిస్తే బాగుంటుందనుకున్నాం. కానీ ‘గోనా గన్నారెడ్డి’ రుద్రమదేవి దగ్గర పనిచేస్తాడు. ప్రేక్షకులకు ఇది రుచించదేమోనని ఆ ప్రయత్నం విరమించాం. ‘బందిపోటు’చిత్రంలో ఆ సమస్య రాలేదు. ‘గుండమ్మ కథ’లో కూడా హేమాహేమీలు సినిమా మొదటి నుంచి తమ నటనా పాటవాన్ని ప్రదర్శిస్తే, రాజనాల చివర్లో వచ్చి మొత్తం జనాకర్షణను తనవైపు తిప్పుకునేలా నటించారు.
అయితే చిత్రపరిశ్రమలోకి మేము వచ్చేటప్పటికి ఆయన సినిమాల్లో నటించడం తగ్గించేశారు. రచయితలుగా ఇండస్ట్రీలో మా బ్రదర్స్ హవా నడుస్తున్న కాలంలో ఆయా సినిమాల్లోని పాత్రలకు ఎవరిని సూచిస్తే వారినే చిత్ర నిర్మాణ సంస్థలు ఎంపిక చేసుకునేవి. కానీ దురదృష్టవశాత్తు రాజనాలగారు మా దృష్టిలోకి రాలేదు. ఈ క్రమంలోనే ఆయన మా దగ్గరకు వచ్చి ‘మీరు డైలాగులు ఎలా చెప్పమంటే అలా చెప్తాను. నాకొక వేషం ఇవ్వండి. మా ఇంట్లో పరిస్థితి అంతగా బాగోలేదు’అంటూ కోరారు. ఆయనలా మాట్లాడటంతో మా గుండెలు తరుక్కుపోయాయి. అంతటి మహానటుడు ఇలా అడుగుతుంటే కన్నీళ్లు వచ్చేశాయి. వెంటనే ఆయనకు మేం రాసే సినిమాలో న్యాయమూర్తి వేషం ఇచ్చాం. ఇప్పుడున్న వారంతా సినీ తారలంటే సర్వసుఖాలు అనుభవిస్తారనుకుంటారు. కానీ, సినీజీవితాలు నీటి బుడగలు లాంటివి. అందుకే ఇండస్ట్రీలో మన హవా నడుస్తునప్పుడే ఒక ఇల్లైనా కట్టుకోవాలి. ఈ విషయంలో మా రచయితలు సత్యానంద్, జంధ్యాలగారినే ఫాలో అవుతాం. అలాగే కృష్ణగారితో మేము ‘తెలుగువీర లేవరా’ సినిమా చేస్తునప్పడు రాజనాల గారికి ఒక వేషం ఇప్పించాం. ఎందుకంటే ఆ పాత్ర ఆయన చేస్తేనే వర్కౌట్ అవుతుంది. కృష్ణగారి ‘సీతారామరాజు’చిత్రంలో ఆయన నటించి ఉండటంతో ప్రేక్షకులకు ఆ జ్ఞాపకాలు గుర్తొస్తాయని మా ఉద్దేశం. కానీ, దురదృష్టవశాత్తు అరకులో షూటింగ్ చేస్తూ ఉండగా ఆయన కాలికి గాయం అయ్యింది. అలా ఆస్పత్రిలో చేరిన ఆయన కొన్నాళ్లకు గుండెపోటుతో మరణించారనే వార్త తెలిసి ఎంతో బాధపడ్డాం.
రాజనాలగారి అసలు పేరు ‘రాజనాల కాళేశ్వరరావు’. కల్లయ్య అంటే బాగోదని రాజనాలగా ఉంచేసుకున్నారు. అలాగే ఆర్. నాగేశ్వరావుగా పేరొందిన ప్రముఖనటుడు నాగేశ్వరావుగారి ఇంటిపేరు కూడా రాజనాలే. అప్పట్లో విలన్ పాత్రధారులంటే ప్రేక్షకులు భయపడేవారు. రాజనాలగారినైతే చెప్పే పనేలేదు. ఆయన హవా నడుస్తున్న కాలంలో ఒక షూటింగ్లో భాగంగా శోభన్‌బాబుగారు డైలాగ్ చెప్పడంలో తడబడుతుంటే రాజనాల విసుక్కున్నారంటా. తర్వాత కాలంలో శోభన్‌బాబుగారు ఒక సూపర్‌స్టార్ అయ్యారు. రాజనాల గారు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కాలంలో శోభన్‌బాబుగారు ఆయన్ను ఇంటికి తీసుకెళ్లి మర్యాద చేసి, తిరిగి ఇంటిదగ్గర దిగబెట్టేటప్పుడు ఒక కవర్లో పెద్దమొత్తంలో డబ్బులు పెట్టి రాజనాల చేతిలో ఉంచారట. అందుకే కెరీర్ బాగా సాగుతున్నప్పుడే మనం కూడబెట్టుకోవాలి. అప్పుడే చివరిదశలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా హాయిగా బతకొచ్చు. సినీ పరిశ్రమలో ఉండే అందరూ ఈ సూత్రాన్ని కచ్చితంగా పాటిస్తే మేలు . ఏది ఏమైనప్పటికి రాజనాలగారిని ఆ విధంగా కోల్పోవటం చిత్ర పరిశ్రమకు తీరనిలోటు. ఆయన సినిమాలు ఇప్పటి ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంటాయి. రాజనాలగారూ..మిమ్మల్ని ఎన్నటికీ మరువలేము’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Venky: 20 ఏళ్ల ‘వెంకీ’.. ఈ హిట్ మూవీ మిస్సైన హీరోయిన్ ఎవరంటే?
రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘వెంకీ’ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Brindha Sivakumar: మణిరత్నం ‘హీరోయిన్ ఛాన్స్’ వదులుకున్న బృందా.. సూర్య సోదరి గురించి మీకు తెలుసా?
ప్రముఖ హీరోలు సూర్య, కార్తి సోదరి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
gautham Menon:ఆ కీలక పాత్రలకు వారిని అనుకున్నా: గౌతమ్‌మేనన్
సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Prithviraj Sukumaran: రెండు ఆఫర్లు ఇచ్చిన చిరంజీవి.. తిరస్కరించిన పృథ్వీరాజ్ సుకుమారన్.. కారణమదే
చిరంజీవి ఇచ్చిన రెండు ఆఫర్లను ఓ సినిమా కారణంగా తిరస్కరించాల్సి వచ్చిందని మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. -
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్‌లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. -
Mohan Babu: మోహన్‌బాబు అలా ‘అల్లుడుగారు’ అయ్యారు.. అదరగొట్టారు
నేడు మోహన్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అల్లుడుగారు’ సినిమా సంగతులు చూద్దాం.. -
Deepika Padukone: అలా మిస్సై.. ‘కల్కి 2898ఏడీ’తో సిద్ధమై: దీపికా టాలీవుడ్ ఎంట్రీ సంగతులివీ..
ప్రముఖ నటి దీపికా పదుకొణె టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Daddy Movie: చిరంజీవి ‘డాడీ’ మూవీ వెంకటేశ్ చేస్తే సూపర్ హిట్ అయ్యేదట!
Daddy movie: ‘డాడీ’ మూవీ యావరేజ్‌గా ఆడటంపై చిరంజీవి ఓ సందర్భంలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. -
Prema: షూటింగ్లో నిజంగానే పాము కాటేసింది.. ఆ హిట్ సినిమాకు 25 ఏళ్లు..
నటి ప్రేమ (Prema) ప్రధానపాత్రలో నటించిన ‘దేవి’ (Devi) చిత్రం విడుదలై నేటికి 25ఏళ్లు పూర్తయింది. -
Sekhar Kammula: ఆ ఫీల్‌గుడ్ స్టోరీ.. పవన్‌ను దృష్టిలో పెట్టుకుని రాసిందే కానీ..!
ఓ హిట్ సినిమా స్టోరీని ప్రముఖ హీరో పవన్ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు ఆ దర్శకుడు. ఆ ఆసక్తికర సంగతులివీ.. -
చిరు-నాగ్-వెంకటేశ్‌లతో మల్టీస్టారర్ తీయాలనుకున్నారు
ఒక టికెట్టుపై డబుల్ ధమాకా వినోదాల్ని పంచిచ్చేవి మల్టీస్టారర్ చిత్రాలు. అందుకే ఏ చిత్రసీమలోనైనా ఓ మల్టీస్టారర్ చిత్రం మొదలవుతుందంటే.. ప్రేక్షకుల చూపంతా అటువైపే మళ్లుతుంటుంది. -
Sharwanand: అందుకే శర్వానంద్ ఆ హిట్ మూవీకి ‘నో’ చెప్పారు.. సెకండ్ ఛాన్స్‌లోనూ!
హీరో శర్వానంద్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయం మీకోసం.. -
Mahesh Babu: మహేశ్ బాబును అనుకున్నారు.. తరుణ్‌తో తెరకెక్కించారు!
తరుణ్ నటించిన ఓ హిట్ చిత్రంలో.. ముందుగా మహేశ్ బాబును హీరోగా అనుకున్నారు నిర్మాత. కానీ, డైరెక్టర్ వద్దనుకున్నారు. అదే సినిమా అంటే? -
Soggadu Movie: రవిబాబు మూవీకి నో చెప్పిన ఉదయ్‌కిరణ్.. కోపంతో నిర్ణయం తీసుకోవడం వల్లే..!
Soggadu Movie: ‘సోగ్గాడు’కి క్యాస్ట్ ఫెయిల్యూర్ కారణంగా మూవీపై ఎలాంటి ప్రభావం పడిందో రవిబాబు ఓ సందర్భంలో చెప్పారు. -
ఈ హీరోలు ఇలా చెబితే డేట్స్ ఇస్తారట!
అసలు ఎవరికి ఏం చెబితే కాల్షీట్స్ ఇస్తారో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ సందర్భంలో ఇలా చెప్పారు. -
Samantha: రామలక్ష్మిపై అందరూ అనుమానం వ్యక్తంచేశారు!
Samantha: కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన సమంత 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆమె ‘ఏమాయ చేసావె’తో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. -
baahubali: ‘బాహుబలి’లో ఆ పాత్రను ఆయన ఎందుకు చేయలేదంటే?
‘బాహుబలి’ సినిమాలోని కట్టప్ప పాత్ర సంజయ్‌దత్‌ను ఊహించి రాసిందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. -
Mahesh babu: ‘మురారి’ శాపం వెనుక స్టోరీ ఇది.. క్లైమాక్స్‌లో ఆ పాట వద్దన్న కృష్ణ..!
మహేశ్‌బాబు కథానాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘మురారి’. సోనాలి బింద్రే కథానాయిక. 2001 ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా 23 ఏళ్లు పూర్తి చేసుకుంది. -
Jayamalini: జయమాలిని కోసం కత్తితో బెదిరింపు!
సినీ తారలను చూసేందుకు జనం విరగబడి రావడం, వారితో సెల్ఫీల కోసం పోటీ పడటం మనం చూస్తుంటాం. సరిగ్గా ఇలాంటి పరిస్థితే అలనాటి నృత్యతార జయమాలినికి (Jayamalini) ఎదురైందట. -
Temper: ఆర్. నారాయణమూర్తి ‘టెంపర్’లో నటించకపోవడానికి కారణమిదే
ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘టెంపర్’ తొమ్మిదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి ఆసక్తికర అంశం మీకోసం.. -
Oy: ‘ఓయ్’ టైటిల్ అర్థమిదే.. మీరు గమనించారా?
సిద్ధార్థ్, షామిలీ జంటగా నటించిన చిత్రం ‘ఓయ్!’. ఈ సినిమాకి ఆ పేరెందుకు పెట్టారో మీకు తెలుసా?
తాజా వార్తలు (Latest News)
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ