DJ Tillu: పటాస్‌ పిల్లతో టిల్లు

సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టిజంటగా నటించిన చిత్రం ‘డి.జె.టిల్లు’. విమల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. వినోద ప్రధానంగా సాగే కొత్తతరం

Updated : 25 Jan 2022 12:17 IST

సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టిజంటగా నటించిన చిత్రం ‘డి.జె.టిల్లు’. విమల్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. వినోద ప్రధానంగా సాగే కొత్తతరం ప్రేమకథతో రూపొందిన ఈ సినిమాలోని ‘పటాస్‌ పిల్ల...’ పాటని సోమవారం విడుదల చేశారు. శ్రీచరణ్‌ స్వరకల్పనలోని ఈ గీతాన్ని కిట్టు విస్సాప్రగడ రచించగా, ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అనిరుధ్‌ ఆలపించారు. విజయ్‌ బిన్ని నృత్యాలు సమకూర్చారు. గీత రచయిత కిట్టు విస్సాప్రగడ మాట్లాడుతూ ‘‘పాటలో ఎలాంటి సన్నివేశాలు ఉంటాయో దర్శకుడు విమల్‌ నాకు చాలా వివరంగా, కళ్లకు కట్టినట్టుగా రాసి పంపారు. దాంతో కొత్తరకం పోలికలు వాడుతూ ఈ పాట రాశా. శ్రీచరణ్‌కి నేను దాదాపు 30 పాటలురాశా. అతనితో పని చేయడం ఎలా ఉంటుందో తెలిసిన అనుభవంతో ఇంకా వేగంగా ఈ పాటని రాశా. పాటలోని దృశ్యాలన్నీ యువతని ఆకట్టుకునేలా ఉంటాయి. అనిరుధ్‌ గొంతు పాటని మరో స్థాయికి తీసుకెళ్లింది’’ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని