Pathaan: ‘బాహుబలి2’ రికార్డు బద్దలు కొట్టేందుకు ‘పఠాన్‌’ రెడీ!

దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ‘పఠాన్‌’ (Pathaan)గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ వరుస రికార్డులు బద్దలు కొడుతున్నాడు.

Published : 13 Feb 2023 20:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ‘పఠాన్‌’ (Pathaan)గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ వరుస రికార్డులు బద్దలు కొడుతున్నాడు. ఈ సినిమా విడుదలై మూడు వారాలు దాటుతున్నా, బాక్సాఫీస్‌ వద్ద సందడి ఏ మాత్రం తగ్గలేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.950కోట్ల కలెక్షన్లను సాధించినట్లు సినీ ట్రేడింగ్‌ వర్గాలు చెబుతున్నాయి. ‘బాహుబలి2’ హిందీ వెర్షన్‌ (రూ.507 కోట్లు) కలెక్షన్ల రికార్డును బద్దలు కొట్టడానికి కొద్ది దూరంలో ‘పఠాన్‌’ ఉండటం విశేషం.

షారుఖ్‌, దీపికా పదుకొణె జంటగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పఠాన్‌’. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. తొలిరోజు నుంచే అభిమానులను అలరించడంతో పాటు, కాసుల వర్షాన్నీ కురిపిస్తోంది. మూడో వారంలోకి ప్రవేశించిన ఈ చిత్రం హిందీలో ఇప్పటివరకూ రూ.475 కోట్లను వసూలు చేసింది. హిందీ వెర్షన్‌ రూ.500 కోట్ల మార్కును చేరుకోవడం అంత కష్టమేమీ కాదు. అలాగే, తెలుగు, తమిళ, భాషల్లో ఈ సినిమా ఇప్పటి వరకూ రూ.17.20 కోట్లు రాబట్టింది. భారత్‌లో అన్ని భాషల్లో కలిపి ‘పఠాన్‌’ రూ.489.05కోట్లు వసూలు చేసినట్లు సినీ విశ్లేషకుడు తరుణ్‌ ఆదర్శ్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని