Pathaan: ‘బేషరమ్‌ రంగ్‌’ వివాదం.. ఇప్పుడు స్పందించిన దర్శకుడు.. ఏమన్నారంటే?

‘పఠాన్‌’ చిత్రంలోని బేషరమ్‌ రంగ్‌ పాట వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ దానిపై ఇప్పుడు స్పందించారు.

Published : 31 Mar 2023 23:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan), దీపికా పదుకొణె (Deepika Padukone), జాన్‌ అబ్రహం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘పఠాన్‌’ (Pathaan) సినిమాలోని ‘బేషరమ్‌ రంగ్‌’ (Besharam Rang) పాట వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సాహిత్యపరంగా కాదుగానీ ఆ పాటలోని హీరోయిన్‌ వస్త్రధారణపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ముఖ్యంగా ఆరెంజ్‌ కలర్‌ బికినీ ధరించడంపై దుమారం రేగింది. దానిపై పలువురు రాజకీయ ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాని బాయ్‌కాట్‌ చేయాలంటూ సోషల్‌ మీడియా వేదికగా కొందరు పోస్ట్‌లు పెట్టారు. కట్‌ చేస్తే, ‘పఠాన్‌’ ఈ జనవరి 25న విడుదలై, సుమారు రూ.1050 కోట్లు మేర వసూళ్లు చేసి కొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తాజాగా ఓ సమ్మిట్‌లో పాల్గొన్న చిత్ర దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌ (Siddharth Anand) ఆ వివాదంపై ఇప్పుడు స్పందించడం గమనార్హం.

‘‘మేం కావాలని ఆ రంగు దుస్తుల్ని ఎంపిక చేయలేదు. మిగతా వాటిలానే చూడగానే నచ్చడంతో  తీసుకున్నాం. ఆ పాటని చిత్రీకరించిన ప్రదేశంలో ఓ వైపు గ్రీనరీ, మరోవైపు బ్లూ కలర్‌ (నీరు) కనిపిస్తాయి. వాటితోపాటు ఆరెంజ్‌ కలర్‌ డ్రెస్సు చూసేందుకు బాగుంది. అందులో తప్పేముంది?’’ అని సిద్ధార్థ్‌ సమాధానమిచ్చారు. ఎంతోమంది కార్మికులు కష్టపడితేనే గానీ సినిమా రూపొందదని, ఆ శ్రమని గుర్తించని వారే బాయ్‌కాట్‌ ట్రెండ్‌కు పిలుపునిస్తుంటారని సిద్ధార్థ్‌ ఆనంద్‌ వ్యాఖ్యానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని