Pathaan: ‘పఠాన్’ తొలి రోజే సెన్సేషన్.. కలెక్షన్ ఎంతంటే?
‘పఠాన్’ సినిమా తొలి రోజు వసూళ్ల వివరాలను నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ ప్రకటించింది. షారుఖ్ ఖాన్ హీరోగా తెరకెక్కిన చిత్రమిది.
ఇంటర్నెట్ డెస్క్: షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) హీరోగా తెరకెక్కిన ‘పఠాన్’ (Pathaan) చిత్రం బాక్సాఫీసు వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ.106 కోట్లు (గ్రాస్) కలెక్ట్ చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్ వెల్లడించింది. ఓపెనింగ్ కలెక్షన్స్ ఈ స్థాయిలో రావడం హిందీ చలన చిత్ర పరిశ్రమలోనే ఇదే తొలిసారి అని తెలిపింది. ఈ చిత్రం ఇండియాలో రూ. 69 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 37 కోట్ల వ్యాపారం చేసింది. బాయ్‌కాట్ ట్రోల్స్ ఎదుర్కొన్న చిత్రం ఫస్ట్ డే ఇంత కలెక్ట్ చేయడం అసాధారణమైన విషయమని సినీ పండితులు అంటున్నారు. రెండో రోజూ అదే స్థాయిలో కలెక్ట్ చేస్తుందని అంచనా వేశారు.
సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 25న విడుదలైంది. షారుఖ్‌తోపాటు దీపికా పదుకొణె, జాన్ అబ్రహంల నటన, విజువల్స్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఓ పాటలో కనిపించే కథానాయిక డ్రెస్సు రంగును, కొన్ని మూమెంట్స్‌ను తప్పుపట్టిన కొందరు ఈ సినిమాని బాయ్‌కాట్ చేయాంటూ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అలాంటి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే ఔరా అనిపించిందీ చిత్రం. 2018లో వచ్చిన ‘జీరో’ తర్వాత షారుఖ్ సుమారు నాలుగేళ్లు విరామం తీసుకున్నా.. తొలి రోజే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరడం విశేషం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Komatireddy: రెండ్రోజుల్లో ప్రభుత్వం స్పందించకుంటే నిరాహార దీక్ష చేస్తా: ఎంపీ కోమటిరెడ్డి
-
Sports News
IND vs AUS: విరాట్ ఔట్.. గావస్కర్ తీవ్ర అసంతృప్తి!
-
World News
Modi: చైనా నెటిజన్లలోనూ ‘మోదీ’ పాపులర్.. నిక్‌నేమ్ కూడా పెట్టారట..!
-
General News
మద్యం మత్తులో వాహనాలను ఢీకొట్టి.. కాల్వలో ఈతకొట్టి.. చుక్కలు చూపించిన టిప్పర్ డ్రైవర్
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TS Millet man: ‘తెలంగాణ మిల్లెట్ మ్యాన్’ పీవీ సతీశ్ ఇక లేరు