Pathaan: ‘వైఆర్‌యఫ్‌ స్పై యూనివర్స్‌’లో ‘పఠాన్‌’ నంబరు 1.. కలెక్షన్‌ ఎంతంటే?

షారుక్‌ ఖాన్‌, దీపికా పదుకొణె, జాన్‌ అబ్రహం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘పఠాన్‌’. ఈ సినిమా ఇప్పటి వరకు ఎంత కలెక్ట్‌ చేసిందంటే?

Published : 03 Feb 2023 02:25 IST

ఇంటర్నెట్ డెస్క్‌: తమ ‘వైఆర్‌యఫ్‌ స్పై యూనివర్స్‌’లో ‘పఠాన్‌’ (Pathaan) చిత్రం రూ. 667 కోట్ల వసూళ్లతో నంబరు 1గా నిలిచిందని నిర్మాణ సంస్థ యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ (Yash Raj Films) వెల్లడించింది. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా పోస్టర్‌ను విడుదల చేసింది. ఇండియాలో రూ. 417 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 250 కోట్లు కలెక్ట్‌ చేసిందని తెలిపింది. బాలీవుడ్‌లో విశేష గుర్తింపు ఉన్న యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌.. వైఆర్‌యఫ్‌ స్టూడియోస్‌, వైఆర్‌యఫ్‌ ఫిల్మ్స్‌, వైఆర్‌యఫ్‌ స్పై యూనివర్స్‌ (YRF Spy Universe) తదితర పేర్లతో ఒక్కో బ్యానర్‌పై ఒక్కో నేపథ్యమున్న కథలను తెరకెక్కిస్తోంది. అలా ‘వైఆర్‌యఫ్‌ స్పై యూనివర్స్‌’లో భాగంగా రూపొందిన ‘పఠాన్‌’ ఈ ఏడాది జనవరి 25న విడుదలైంది. 9 రోజుల్లోనే రూ. 667 కోట్ల బిజినెస్‌ చేసింది. ఇదే బ్యానర్‌లో 2017లో వచ్చిన ‘టైగర్‌ జిందా హై’ సుమారు రూ. 559.86 కోట్లు, ‘వార్‌’.. రూ. 477 కోట్లు, ‘ఏక్‌థా టైగర్‌’.. రూ. 318.19 కోట్ల వసూళ్లు చేశాయి.

వివాదాల నడుమ విడుదలైన ‘పఠాన్‌’ తొలి రోజు నుంచీ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. వసూళ్లపరంగా బాలీవుడ్‌లో రోజుకో కొత్త రికార్డు సృష్టిస్తోంది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని హీరో షారుఖ్‌ ఖాన్‌ (Shah Rukh Khan), దీపికా పదుకొణె (Deepika Padukone), జాన్‌ అబ్రహం (John Abraham)ల యాక్షన్‌ స్టంట్స్‌, విజువల్స్‌కు మంచి మార్కులు పడ్డాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు