Pathaan: ఆ మూడు విషయాల్లో ‘పఠాన్’ రికార్డు.. అలా ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్‌గా!
ఎప్పుడెప్పుడొస్తుందా? అని షారుఖ్ ఖాన్ అభిమానులంతా ఎదురుచూసిన ‘పఠాన్’ సినిమా కొన్ని గంటల్లో తెరపైకి రాబోతుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలపై ఓ లుక్కేద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ నటులు షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan), దీపికా పదుకొణె (Deepika Padukone) జంటగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘పఠాన్’ (Pathaan). ఈ సినిమా జనవరి 25న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆ మూవీ విశేషాలు చూద్దాం..
⏩ హీరోగా షారుఖ్ ఖాన్ తెరపై కనిపించి నాలుగేళ్లపైనే అయింది. ఆ గ్యాప్ తర్వాత ఆయన ప్రకటించిన చిత్రం కావడంతో ‘పఠాన్’పై ముందు నుంచీ ఆసక్తి నెలకొంది. ఇందులో ఆయన ‘రా’ ఏజెంట్‌గా నటించారు. కథానాయకుడిగా షారుఖ్ కనిపించిన చివరి చిత్రం ‘జీరో’. 2018 డిసెంబరులో విడుదలైంది. 2022లో.. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’, ‘లాల్ సింగ్ చడ్డా’, ‘బ్రహ్మాస్త్ర’ సినిమాల్లో అతిథి పాత్రల్లో కనిపించి, అలరించారు షారుఖ్.
⏩ కథానాయికగా దీపికా పదుకొణె ఎంపికైందని తెలిసినప్పటి నుంచే సినీ ప్రియులు ఈ మూవీపై ప్రత్యేక దృష్టిపెట్టారు. షారుఖ్, దీపికల కాంబినేషన్లో గతంలో వచ్చిన పలు చిత్రాలు సూపర్‌హిట్‌గా నిలవడమే అందుకు కారణం. ఇప్పటి వరకు ‘ఓం శాంతి ఓం’, ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’, ‘హ్యాపీ న్యూ ఇయర్’ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుందీ జోడీ.
⏩ ప్రముఖ నటుడు జాన్ అబ్రహాం (John Abraham) ఈ సినిమాలో భాగమయ్యారు. ఇందులో ఆయన జిమ్ కార్టస్ అనే విలన్ పాత్రలో కనిపిస్తారు. షారుఖ్ గతంలో నటించిన ‘కభీ అల్విదా నా కెహనా’ సినిమాలోని ఓ పాటలో జాన్ అబ్రహాం తళుక్కున మెరిసిన సంగతి తెలిసిందే. ‘పఠాన్’లో అశుతోశ్ రానా, డింపుల్ కపాడియా, గేవీ చాహల్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ప్రముఖ హీరో సల్మాన్‌ఖాన్ గెస్ట్ రోల్లో కనిపించనున్నారు.
🎥 ఈ సినిమాలోని కొన్ని పోరాట దృశ్యాలను దుబాయ్‌లో చిత్రీకరించారు. మరికొన్ని యాక్షన్ ఘట్టాలను స్పెయిన్‌లో షూట్ చేశారు. మిగిలిన పోర్షన్‌ను ఇండియా, అఫ్గానిస్తాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, టర్కీ, రష్యా, ఇటలీ తదితర దేశాల్లో చిత్రీకరించారు. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ. 250 కోట్లు.
🎥 సినిమాకే హైలైట్‌గా నిలిచే ఛేజింగ్ సన్నివేశాలను సైబీరియా (రష్యా)లోని గడ్డకట్టిన బైకల్ సరస్సులో తీశారు. అక్కడ చిత్రీకరించిన తొలి బాలీవుడ్ సినిమాగా ‘పఠాన్’ నిలిచినట్టైంది. ఎముకలు కొరికే చలిలో బైకల్లో షూటింగ్ చేయడం సాహసంతో కూడుకున్నదని, ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచేందుకు కష్టాన్ని భరించామని దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
🎥 ఐమ్యాక్స్ కెమెరాలతో చిత్రీకరించిన తొలి హిందీ చిత్రంగానూ ‘పఠాన్’ నిలిచింది. ఇతర కెమెరాలకంటే ఐమ్యాక్స్ కెమెరాల ఫిల్మ్ సైజు చాలా పెద్దగా ఉంటుంది. హై ఎండ్ రిజల్యూషన్ కలిగి ఉండి, భారీ ధర పలికే ఆ కెమెరాల సంఖ్య ప్రపంచంలోనే చాలా తక్కువ. మరోవైపు, ఐ. సి. ఇ థియేటర్ ఫార్మాట్లో విడుదలకాబోతున్న ఫస్ట్ ఇండియన్ ఫిల్మ్ ఇదే కానుంది. ఐ. సి. ఇ పూర్తి పేరు ఇమ్మెర్సివ్ సినిమా ఎక్స్పీరియన్స్ (Immersive Cinema Experience). ఈ ఫార్మాట్ కలిగిన తెరలు ఇండియాలో రెండే (దిల్లీ) ఉన్నాయని సమాచారం. వీటిల్లో సినిమా ప్రదర్శితమయ్యే పెద్ద తెర (ICE Theaters)తోపాటు థియేటర్ గోడలకు ఇరువైపులా చిన్న స్క్రీన్లు అమర్చి ఉంటాయి. బిగ్ స్క్రీన్‌పై వచ్చే సన్నివేశాల్లోని రంగులు ఆ స్మాల్ స్క్రీన్‌పై ఫ్లాష్ అవుతూ ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచుతాయి. ఈ విధానంలో ఆడియో కూడా అద్భుతంగా ఉంటుంది.
🎼 విశాల్- శేఖర్ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ చిత్రంలోని ‘బేషరమ్ రంగ్’ (Besharam Rang) గీతం శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకుంది. మరోవైపు, తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఆ పాటలో కనిపించే కథానాయిక బికినీ రంగు (గోల్డెన్ స్విమ్‌సూట్)ను తప్పుబడుతూ పలువురు రాజకీయ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అది కాస్తా సినిమాను బ్యాన్ చేయాలనేంత వరకు వెళ్లింది. దాంతో, ఈ సినిమా టైటిల్ సోషల్ మీడియాలో కొన్ని రోజులు ట్రెండ్ అయింది.
🎬 సంబంధిత పాటలోని పలు విజువల్స్, కొన్ని సంభాషణలపై అభ్యంతరం తెలిపి, వాటిని కట్ చెప్పిన అనంతరం సెన్సార్ బోర్డు ‘పఠాన్’కు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. సినిమా నిడివి: 146.16 నిమిషాలు (2గంటలా 26 నిమిషాల 16 సెకన్లు).
🎞️ ఈ సినిమా కథ విషయాకొస్తే.. ఔట్ఫిట్ ఎక్స్ అనే ప్రైవేట్ ఉగ్రవాద సంస్థ ఒకానొక సమయంలో ఇండియాను లక్ష్యంగా చేసుకుంటుంది. దానికి నాయకుడు జిమ్ (జాన్ అబ్రహాం). ఆ టెర్రరిస్టులను మట్టికరిపించేందుకు ‘రా’ ఏజెంట్ అయిన పఠాన్ (షారుఖ్) రంగంలోకి దిగుతాడు.. అనేది ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. మరి, ఆ ఆపరేషన్ ఎలా ఉంటుంది అన్నది తెరపై చూడాల్సిందే. ఈ సినిమా హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లోనూ రిలీజ్‌కానుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామ్ చరణ్ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా.. విక్రమ్ అలా!
పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ.. -
Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్‌టాపిక్‌గా నిలిచి!
అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాల విశేషాలు.. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్‌పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Alia Bhatt: అందుకు క్లాస్‌లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్‌డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్‌ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్ తేజ్ అలా.. ‘టిల్లు’ ఇలా!
మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
Valentine Day: వాలంటైన్స్ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..
వాలంటైన్స్ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. -
తొలి సినిమా ఫ్లాప్.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్ కెరీర్ To పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది? -
Jeethu Joseph: 17 సినిమాలు.. మూడే ఫ్లాప్‌లు.. చైనీస్, ఇండోనేషియా, కొరియాలోనూ రీమేక్ అయిన మొదటి భారతీయ సినిమా ఆయనదే!
Jeethu Joseph: మోహన్‌లాల్ కథానాయకుడిగా జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ‘నెరు’ ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో జీతూ గురించి ఆసక్తికర విషయాలు.. -
Chiranjeevi: ఆ అవమానమే.. సుప్రీం హీరోను మెగాస్టార్ చేసింది: పద్మ విభూషణ్ చిరంజీవి ప్రయాణమిది!
ప్రముఖ నటుడు చిరంజీవికి అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మ విభూషణ్’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం.. -
Salaar Part 2: ఈ ప్రశ్నలకు సమాధానం... ‘సలార్-2: శౌర్యాంగ పర్వం’ చెబుతుంది!
‘సలార్’ పార్ట్-1 చూసిన వారందరూ ఇప్పుడు పార్ట్-2 ‘శౌర్యాంగ పర్వం’ కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఈ భాగంలో ఏయే ప్రశ్నలకు సమాధానం లభించనుంది? -
Telugu Movies: రిపబ్లిక్ డే ‘డబ్బింగ్’ చిత్రాలదే.. ఆ రోజు ‘ఈగల్’ సింగిల్‌గా..?
రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలకానున్న చిత్రాలు, ఫిబ్రవరి రెండో వారంలో రాబోతున్న సినిమాలపై ప్రత్యేక కథనం.. -
Hombale Films: ఆ పరాజయం.. ‘కేజీయఫ్’, ‘సలార్’ హిట్లకు కారణమైంది: హోంబలే ప్రయాణమిదీ
ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హోంబలే ఫిల్మ్స్’కు ఆ పేరు ఎందుకు పెట్టారో తెలుసా? ఆ బ్యానర్‌పై వచ్చిన సినిమాల వివరాలివీ.. -
Pallavi prashanth: ‘బిగ్‌బాస్’కు వెళ్తానంటే ఎగతాళి చేశారు.. ‘విన్నర్’గా నిలిచిన ‘రైతుబిడ్డ’ జర్నీ ఇదీ!
bigg boss 7 telugu winner pallavi prashanth: ఫోక్ సాంగ్స్ క్రియేటర్‌గా జీవితాన్ని మొదలు పెట్టిన పల్లవి ప్రశాంత్ లైఫ్ జర్నీ సాగిందిలా..! -
Bollywood Roundup: రీమేక్స్‌తో డీలా.. షారుక్ సినిమాలతో కొత్త కళ: బాలీవుడ్ తీరిలా!
ఈ ఏడాది విడుదలైన బాలీవుడ్ సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ చిత్రం హిట్? ఏది ఫట్? చూసేయండి.. -
Venkatesh: అద్దమే ఫిల్మ్‌స్కూల్.. హోస్ట్‌గా ఆ షోస్‌కు ‘నో’: వెంకటేశ్ గురించి ఈ విశేషాలు తెలుసా?
ప్రముఖ హీరో వెంకటేశ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినిమాల గురించి పలు ఆసక్తికర సంగతులు చూద్దాం..
తాజా వార్తలు (Latest News)
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ