Pathaan: పఠాన్‌కు వెన్నెముక ఆయనే: షారుక్ ఖాన్
జాన్ అబ్రహం పోషించిన జిమ్ పాత్ర ‘పఠాన్’ చిత్రానికి వెన్నెముకలాంటిదని షారుక్ ఖాన్ అన్నారు. ముంబయిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు.
ముంబయి: షారుక్ ఖాన్ (Shah Rukh Khan), దీపికా పదుకొణె (Deepika Padukone), జాన్ అబ్రహం (John Abraham) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘పఠాన్’ (Pathaan). సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 25న విడుదలై, రికార్డు స్థాయిలో వసూళ్లు చేస్తోంది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పేందుకు చిత్రబృందం ముంబయిలో ప్రెస్‌మీట్ నిర్వహించింది. షారుక్, అబ్రహం, దీపికా పదుకొణె పాల్గొని సందడి చేశారు.
వేదికపై షారుక్ మాట్లాడుతూ.. ‘‘పఠాన్’ విషయంలో గొప్పదేదంటే జాన్ అబ్రహం పోషించిన జిమ్ పాత్ర. అది ఈ చిత్రానికి వెన్నెముక లాంటిది. ఆయన ఈ సినిమాలో ఉండడం వల్ల కాస్ట్యూమ్స్ ఖర్చు కూడా తగ్గింది. నా గురించి, దీపిక గురించి మీకు ఇప్పటికే తెలుసు. మా గురించి మీరేం ప్రశ్న అడిగినా ఆమె చేతిపై ముద్దు పెడతా. అదే సమాధానం అవుతుంది’’ అని నవ్వుతూ అన్నారు. తనను అక్బర్‌తో పోల్చుకున్న షారుక్.. దీపికను అమర్ అని, జాన్ అబ్రహంను ఆంటోనీగా అభివర్ణించారు. సినిమా అంటే అదేనని, వ్యక్తుల మధ్య తారతమ్యాలు ఉండవని అన్నారు. తామంతా సినిమాను ఎంతగానో ప్రేమిస్తామని తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mann Ki Baat: అవయవదానానికి ముందుకు రావాలి.. ప్రధాని మోదీ
-
Movies News
Shaakuntalam: ఆమెకు శిక్షణ అవసరం లేదు.. తను పుట్టుకతోనే సూపర్ స్టార్: సమంత
-
Sports News
Dhoni-IPL: ఐపీఎల్ 2023 తర్వాత ధోనీ రిటైర్ అవుతాడా? చాట్‌జీపీటీ సమాధానం ఇదే..
-
Politics News
D Srinivas: సొంతగూటికి డీఎస్.. కాంగ్రెస్‌లో చేరిన సీనియర్ నేత
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Malla Reddy: నన్ను పవన్ కల్యాణ్ సినిమాలో విలన్‌గా అడిగారు: మల్లారెడ్డి