Pathaan: ‘పఠాన్’ టీజర్ వచ్చేసింది.. యాక్షన్‌తో అదరగొట్టేసిన షారుక్
బీటౌన్ అగ్ర కథానాయకుడు షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పఠాన్’. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ముంబయి: సుమారు నాలుగేళ్ల విరామం తర్వాత బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పఠాన్’ (Pathaan). యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సిద్ధమైన ఈ సినిమాలో జాన్ అబ్రహం, దీపికా పదుకొణె కీలకపాత్రలు పోషించారు. బుధవారం షారుక్ పుట్టినరోజు పురస్కరించుకుని చిత్రబృందం ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసింది. ‘‘పఠాన్ గురించి నీకు ఏం తెలుసు?’’ అనే డైలాగ్‌తో మొదలైన టీజర్ ఫైట్ సీక్వెన్స్‌తో యాక్షన్ ప్రియుల్ని అలరించేలా ఉంది.
‘‘మూడేళ్ల నుంచి అతడి జాడ లేదు. చివరి మిషన్‌లో అతడు పట్టుబడ్డాడు. అతడిని వేధించారని విన్నా. పఠాన్ ఇంకా బతికే ఉన్నాడో లేదో తెలియదు’’ అనే డైలాగ్‌తో షారుక్ పాత్రని పరిచయం చేయడం.. ‘బతికే ఉన్నా’ అంటూ ఆయన చెప్పడం.. వంటి సీన్స్ హీరో ఫ్యాన్స్‌తో ఈలలు వేయించేలా ఉన్నాయి. ఇంతకీ ఈ పఠాన్ ఎవరు? అతడిని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు? ఇందులో జాన్ అబ్రహం పాత్ర ఏమిటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది. సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. వచ్చే ఏడాది జనవరి 25న ఈసినిమా విడుదల కానుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Shocking: షాకింగ్.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రభుత్వ ఉద్యోగి మృతి!
-
India News
Happiest Countries: వరుసగా ఆరోసారి ఫిన్లాండ్.. ఉక్రెయిన్, రష్యా కంటే వెనుకంజలో భారత్!
-
Sports News
MIW vs DCW: చెలరేగిన దిల్లీ.. 9 వికెట్ల తేడాతో ముంబయిపై విజయం
-
Movies News
Social Look: సముద్రంలో హన్సిక షికారు.. ఆండ్రియా శారీ పిక్!
-
Sports News
IND vs AUS: మూడో వన్డేలో సూర్యకుమార్‌ని తప్పిస్తారా? రోహిత్ ఏమన్నాడంటే..
-
Movies News
Salman khan: సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు ఈ- మెయిల్.. భద్రత మరింత పెంపు!