Pathaan: ఓటీటీలో ‘పఠాన్’ స్ట్రీమింగ్ షురూ.. ఇదే సర్‌ప్రైజ్!
Pathaan: షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించిన ‘పఠాన్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. సెన్సార్ వల్ల థియేటర్ వెర్షన్‌లో తొలగించిన కొన్ని సీన్స్ ఓటీటీ వెర్షన్‌లో యాడ్ చేశారు.
ఇంటర్నెట్‌డెస్క్: థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా అలరించి ఇప్పుడు ఓటీటీలో సందడి చేస్తోంది షారుఖ్‌ఖాన్ (Shah rukh Khan) ‘పఠాన్’ (Pathaan). అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఇప్పటికే స్ట్రీమింగ్ మొదలైంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ హైఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ కొన్ని సర్‌ప్రైజ్‌లను కూడా తెచ్చింది. థియేటర్‌లో ప్రదర్శించడానికి సాధ్యం కాని కొన్ని సన్నివేశాలను ఓటీటీలో విడుదల చేశారు. అంటే థియేటర్‌లో సినిమా చూసిన వారితో పాటు, ఓటీటీలో చూసేవారికి ఆ సీన్స్ బోనస్ అన్నమాట.
జనవరి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పఠాన్’ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1048 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే, సెన్సార్ బోర్డు నిబంధనలకు కట్టుబడి చాలా సన్నివేశాలను చిత్ర బృందం తొలగించింది. వాటిలో కొన్ని సీన్లను ఇప్పుడు ఓటీటీ వెర్షన్‌లో యాడ్ చేశారు. దాదాపు మూడు నిమిషాల నిడివి ఉన్న ఆ సన్నివేశాలు ఇప్పుడు అలరిస్తున్నాయి. సాధారణంగా థియేటర్ వెర్షన్‌ను యథాతధంగా ఓటీటీలు విడుదల చేస్తుంటాయి. కానీ, పఠాన్ విషయంలో అలా కాకుండా తీసేసిన సన్నివేశాలను జోడించారు. దీంతో షారుఖ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఇక సినిమా విషయానికొస్తే దీపిక పదుకొణె కథానాయికగా నటించిన ఈ చిత్రంలో జాన్ అబ్రహాం ప్రతినాయకుడిగా నటించారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
రూ.99కే కొత్త సినిమా.. విడుదలైన రోజే ఇంట్లో చూసే అవకాశం
-
Sports News
ఎంతో భావోద్వేగానికి గురయ్యా.. మరోసారి అలాంటి బాధ తప్పదనుకున్నా: సీఎస్కే కోచ్
-
World News
Flight Passengers: బ్యాగేజ్‌తో పాటు ప్రయాణికుల శరీర బరువూ కొలవనున్న ఎయిర్‌లైన్స్ సంస్థ!
-
India News
Mahindra - Dhoni: ధోనీ రాజకీయాల గురించి ఆలోచించాలి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
-
Sports News
MS Dhoni : మైదానాల్లో ధోనీ మోత మోగింది.. ఆ శబ్దం విమానం కంటే ఎక్కువేనట..
-
Crime News
ప్రియుడితో భార్య పరారీ.. స్టేషన్‌కు భర్త బాంబు బెదిరింపు ఫోన్‌కాల్!