Pathu Thala: ఓటీటీలో శింబు ‘పత్తుతలా’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

pathu thala ott release date: శింబు కీలక పాత్రలో నటించిన ‘పత్తుతలా’ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది!

Published : 22 Apr 2023 14:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శింబు (simbu) కథానాయకుడిగా ఎన్‌.కృష్ణ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పత్తు తలా’ (pathu thala ott release date). గౌతమ్‌ కార్తీక్‌, ప్రియా భవానీశంకర్‌, గౌతమ్‌ మేనన్‌ కీలక పాత్రలు పోషించారు. మార్చి 30న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే తెచ్చుకుంది. అంతేకాదు, విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, సింప్లీసౌత్‌ ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఏప్రిల్‌ 27 నుంచి తమిళంలో ‘పత్తుతలా’ రెండు ఓటీటీల్లోనూ అందుబాటులోకి రానుంది. చిత్ర నిర్మాణ సంస్థ గ్రీన్‌ స్టూడియోస్‌ ఈ విషయాన్ని తెలియజేస్తూ పోస్టర్‌ను పంచుకుంది. కన్నడలో ఘన విజయం సాధించిన ‘మఫ్టీ’ రీమేక్‌గా ‘పత్తుతలా’ తెరకెక్కింది. మొత్తం మీద ఈ సినిమా దాదాపు రూ.50కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. తమిళంలో విజయం సాధించిన సినిమాలను తెలుగులో విడుదల చేస్తుంటారు. అలా శింబు నటించిన ఒకట్రెండు సినిమాలు ఇక్కడ సందడి చేశాయి. కానీ, ఈ సినిమాను ఎందుకో తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురాలేదు. ఓటీటీలోనూ కేవలం తమిళంలోనే స్ట్రీమింగ్‌ కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని