
అదే గోపాల గోపాలలో నటించేలా చేసింది:పవన్
హైదరాబాద్: విక్టరీ వెంకటేశ్‌తో తన స్నేహం ఎంతో ప్రత్యేకమైందని పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తెలిపారు. ఆదివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ప్రకటన ద్వారా మంచి మనసున్న వెంకీకి హృదయపూర్వక శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. ‘తెలుగు చిత్ర పరిశ్రమలో వెంకటేశ్‌తో నాకున్న స్నేహం ఎంతో ప్రత్యేకమైంది. నేను కథానాయకుడిని కావడానికి ముందు నుంచే ఆయనతో నాకు అనుబంధం ఉంది. తరచూ వెంకటేశ్‌తో మాట్లాడుతూ ఉండేవాడిని. ఆయన మంచి చదువరి. ముఖ్యంగా ఆధ్యాత్మిక, ధార్మిక, లౌకిక సంబంధమైన పుస్తకాలు ఎక్కువగా చదివేవారు. అందులో ఉన్న విషయాలు నాకు వివరించేవారు’.
‘ఆ సంభాషణలు, చర్చలే మా స్నేహాన్ని దృఢపరిచాయి. ఇప్పటికీ మా ఇద్దరి మధ్య సినిమా విషయాలతోపాటు హైందవ ధర్మం, భక్తికి సంబంధించిన విషయాలు చర్చకు వస్తుంటాయి. ఆ స్నేహమే మేమిద్దరం ‘గోపాల గోపాల’ చిత్రంలో నటించేలా చేసింది. మా ఆలోచనలకు ఆ చిత్రం అద్దంపట్టింది. కొత్తతరం దర్శకుల కథలకు.. ఆలోచనలకు అనుగుణంగా తనను తాను మలచుకొనే వెంకటేశ్ మరిన్ని విజయాలతో ప్రేక్షకులను మెప్పిస్తారని ఆకాంక్షిస్తున్నా’ అని పవన్ చెప్పారు. ఆయన, వెంకీ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘గోపాల గోపాల’. కిశోర్ కుమార్ పార్ధసాని దర్శకుడు. సురేశ్‌బాబు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా 2015 జనవరి 10న విడుదలై, ప్రేక్షకుల్ని అలరించింది.
ఇవీ చదవండి..
వెంకటేశ్‌ను మార్చేసిన ‘ప్రేమించుకుందాం రా!’
వెంకీ మనతో ఉంటే నిరాశే ఉండదు..
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
T Congress: విష్ణువర్ధన్‌రెడ్డి ఇంట్లో లంచ్.. వస్తామని ముఖం చాటేసిన కాంగ్రెస్ సీనియర్లు!
-
Business News
Services PMI: ధరలు పెరిగినా.. సేవలకు డిమాండ్ తగ్గలే
-
Technology News
Location Tracking:యాప్స్ మీ లొకేషన్‌ను ట్రాక్ చేస్తున్నాయని అనుమానమా..? ఇలా చేయండి!
-
General News
CM Jagan: ‘బైజూస్’తో విద్యార్థులకు మెరుగైన విద్య: సీఎం జగన్
-
India News
IndiGo: విమానప్రయాణంతో ఇబ్బంది పడ్డ విద్యార్థిని.. సాయం చేసిన కేంద్రమంత్రి
-
India News
Misleading Rahul video : న్యూస్ యాంకర్ అరెస్టుపై రెండు రాష్ట్రాల పోలీసుల వార్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- IND vs ENG : మొత్తం మారిపోయింది
- Raghurama: రఘురామ ఇంట్లోకి ప్రవేశించే యత్నంలో దొరికిపోయిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్!
- Double BedRooms: అమ్మకానికి.. రెండు పడక గదుల ఇళ్లు!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- China’s real estate crisis: పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్ ఎస్టేట్ ..!
- Hyderabad News: సాఫ్ట్వేర్ ఇంజినీర్ హత్యకు రూ.4.50 లక్షల సుపారీ!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (05/07/22)
- Hyderabad News: రోజూ ‘బయోమెట్రిక్’ వేసి వెళ్తే నెలకు రూ. 15 వేలు!