Pawan kalyan: అగ్ని తుపాను..
‘హరి హర వీరమల్లు’ సినిమాని పూర్తి చేయడంపై దృష్టి సారించిన పవన్‌కల్యాణ్ చిత్రీకరణని పరుగులు పెట్టిస్తున్నారు. మరోవైపు కొత్త కథలకీ పచ్చజెండా ఊపుతున్నారు.
‘హరి హర వీరమల్లు’ సినిమాని పూర్తి చేయడంపై దృష్టి సారించిన పవన్‌కల్యాణ్ (Pawan kalyan) చిత్రీకరణని పరుగులు పెట్టిస్తున్నారు. మరోవైపు కొత్త కథలకీ పచ్చజెండా ఊపుతున్నారు. ‘సాహో’ ఫేమ్ సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో సినిమా చేయడానికి పవన్‌కల్యాణ్ అంగీకారం తెలిపారు. ఈ కలయికలో సినిమాని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఆదివారం కాన్సెప్ట్ పోస్టర్‌తో ఈ ప్రాజెక్ట్‌ని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. అగ్నితుపాను రాబోతుంది... అని రాసున్న కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎప్పుడు మొదలవుతుంది? చిత్రం పేరేమిటి? ఇతర నటీనటులెవరనే విషయాల్ని మాత్రం ప్రకటించలేదు. రవి కె.చంద్రన్ కెమెరా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఇందులో పవన్‌కల్యాణ్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో సందడి చేయనున్నారని తెలుస్తోంది.
వచ్చే వారంలోనే?
ఇప్పటికే ఒప్పుకున్న మరో సినిమానీ పట్టాలెక్కించనున్నారు పవన్‌కల్యాణ్. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత పవన్‌కల్యాణ్ - హరీష్‌శంకర్ కలయికలో మరో చిత్రం ఖరారైన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఆ సినిమా వచ్చే వారంలో ప్రారంభం కానుందని సమాచారం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: భారత్ X ఆసీస్ తొలి టెస్టు.. ముగ్గురు అరంగేట్రం.. టాస్ నెగ్గిన ఆసీస్
-
Ts-top-news News
TSLPRB: ‘ఎస్సై, కానిస్టేబుల్ స్థాయి అభ్యర్థులకు’ మరోసారి ఎత్తు కొలతలు
-
Ap-top-news News
Viveka Murder Case: నేడు హైదరాబాద్‌కు వివేకా హత్య కేసు నిందితులు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Overseas Education: భారతీయ విద్యార్థుల గమ్యస్థానాలు అమెరికా, కెనడా, బ్రిటన్
-
World News
Video games: వీడియో గేమ్స్‌తో పిల్లల విజ్ఞాన సముపార్జన దెబ్బతినదు