Pawan Kalyan: హరి హర వీరమల్లు.. పవన్‌ సరికొత్తగా కనిపించనున్నారా?

‘భీమ్లానాయక్‌’ విజయంతో జోరుమీదున్నారు అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌(Pawan kalyan).

Published : 20 Apr 2022 01:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘భీమ్లానాయక్‌’ విజయంతో జోరుమీదున్నారు అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌(Pawan kalyan). ఆయన కీలక పాత్రలో క్రిష్‌ తెరకెక్కిస్తున్న పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామా ‘హరి హర వీరమల్లు’(Hari Hara Veera Mallu). నిధి అగర్వాల్‌ కథానాయిక. ఇప్పటికే 50శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం మరోసారి రంగంలోకి దిగారు పవన్‌. ఇటీవల మొదలైన తాజా షెడ్యూల్‌లో యాక్షన్‌ సీక్వెన్స్‌తో పాటు, ప్రధాన తారగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ పాత్ర యోధుడిలా రాబిన్‌హుడ్‌ను పోలి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇందులో పవన్‌ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారట. మూడు పాత్రల్లోనూ ‘హరి హర వీరమల్లు’ పాత్రదే స్పెషల్‌ అట్రాక్షన్‌ అంటున్నారు. ఈ సినిమాలో పవన్‌ పాత్రలను దృష్టిలో పెట్టుకుని  30 రకాల విభిన్న దుస్తులు సిద్ధం చేసిందట చిత్ర బృందం. ప్రతి డ్రెస్‌ దేనికదే ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుందట.  మరి పవన్‌కల్యాణ్‌ ఎలా కనిపిస్తారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఈ సినిమా కోసం పవన్‌ మార్షల్‌ ఆర్ట్స్‌ కూడా ప్రాక్టీస్‌ చేస్తున్న ఫొటోలను చిత్ర బృందం అభిమానులతో పంచుకుంది. ఇక తెరపై ‘వీరమల్లు’గా పవన్‌ విజృంభణ చూసేందుకు అభిమానులు ఆసక్తికగా ఎదురు చూస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని