నిహారిక పెళ్లి వేడుకల్లో పవన్‌ కల్యాణ్‌

నిహారిక-చైతన్యల పెళ్లి వేడుకల్లో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ భాగమయ్యాడు. ఇన్ని రోజులు బిజీ షెడ్యూల్‌ కారణంగా కుటుంబ సభ్యులతో పాటు వెళ్లలేదు. ఈ రోజే ఉదయ్‌పూర్‌కు చేరుకున్నారు. దీంతో

Updated : 09 Dec 2020 12:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నిహారిక-చైతన్యల పెళ్లి వేడుకల్లో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ భాగమయ్యారు. ఇన్ని రోజులు బిజీ షెడ్యూల్‌ కారణంగా కుటుంబ సభ్యులతో పాటు వెళ్లలేదు. మంగళవారం  పవన్‌ ఉదయ్‌పూర్‌కు చేరుకున్నారు. తమ్ముడు వచ్చాడని చెబుతూ.. నాగబాబు ఫొటో షేర్‌ చేశారు. ఇక మెగా, అల్లు ఫ్యామిలీలు పెళ్లి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నాయి. అందరూ కలిసి దిగిన గ్రూప్‌ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. దీంతో అభిమానులు తెగ లైక్‌లు కొడుతున్నారు. ఈ వేడుకల్లో పవన్‌ కల్యాణ్‌తో పాటు తనయుడు అకీరా కూడా ఉన్నాడు. 

ఈ నెల 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నాగబాబు తనయ నిహారికతో గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్యల వివాహం జరగనుంది. ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్‌ దీనికి వేదిక కాబోతుంది. 

ఇవీ చదవండి

DAY 1:నిహారిక పెళ్లి వేడుక వీడియో చూశారా?

నిహారిక సంగీత్‌.. వైరల్‌ వీడియోలు







Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని