Pawan Kalyan: ‘బ్రో’ ద్వయ చిద్విలాసం

పవన్‌ కల్యాణ్‌.. ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

Updated : 30 May 2023 14:18 IST

వన్‌ కల్యాణ్‌.. ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే పవన్‌, సాయితేజ్‌ల ఫస్ట్‌లుక్‌లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ‘బ్రో’ ద్వయం పేరుతో ఈ ఇద్దరూ కలిసి ఉన్న పోస్టర్‌ను బయటకు వదిలారు. అందులో పవన్‌ ఓ బైక్‌పై కాలు పెట్టి స్టైలిష్‌గా నిల్చొని ఉండగా.. ఆయన మోకాలిపై చేతులు ఉంచి తన వెనకాల తేజు కనిపించాడు. విభిన్నమైన సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో పవన్‌ కాలస్వరూపుడిగా కనిపించనున్నారు. మార్క్‌ అలియాస్‌ మార్కండేయులు అనే పాత్రలో సాయిధరమ్‌ తేజ్‌ నటిస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్‌, కూర్పు: నవీన్‌ నూలి, ఛాయాగ్రహణం: సుజిత్‌ వాసుదేవ్‌.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు