Pawan Kalyan: ఆయన సినిమా రివ్యూలు ఎంతో ఆసక్తిని రేకెత్తించేవి: పవన్‌కల్యాణ్‌

సీనియర్‌ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి మృతిపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంతాపం తెలిపారు. ...

Published : 05 Jul 2022 10:55 IST

అమరావతి: సీనియర్‌ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి మృతిపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. శ్రీహరి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘‘పాత్రికేయరంగంలో.. ప్రత్యేకించి సినిమా జర్నలిజంలో గుడిపూడి శ్రీహరిది విశేష అనుభవం. ఆయన సినిమా రివ్యూలు ఎంతో ఆసక్తిని రేకెత్తించేవి. తెలుగు చిత్రసీమ ప్రస్థానంలోని అనేక ముఖ్య ఘట్టాలను శ్రీహరి అక్షరబద్ధం చేశారు. ‘హరివిల్లు’ శీర్షికతో చేసిన రచనలు ఆయన నిశిత పరిశీలనను తెలిపేవి’’ అని పవన్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు