Pawan kalyan: రీమేక్ వద్దు
పవన్‌కల్యాణ్‌తో తీయనున్న సినిమా గురించి ఉత్సాహవంతమైన కబురు అంటూ ఊరిస్తున్నారు దర్శకుడు హరీష్‌శంకర్.
పవన్‌కల్యాణ్‌తో (Pawan Kalyan) తీయనున్న సినిమా గురించి ఉత్సాహవంతమైన కబురు అంటూ ఊరిస్తున్నారు దర్శకుడు హరీష్‌శంకర్ (Harish Shankar). విజయవంతమైన ‘గబ్బర్‌సింగ్’ తర్వాత ఈ కలయికలో మరో సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ‘భవదీయుడు భగత్‌సింగ్’ పేరుతో ఆ సినిమా రూపొందనున్నట్టు 2021లోనే ప్రకటించారు. కానీ ఇప్పటివరకూ ఆ సినిమా పట్టాలెక్కలేదు. అయితే కొన్నాళ్లుగా ఈ కలయికలో రానున్నది తమిళ చిత్రం ‘తెరి’ రీమేక్ అని ప్రచారం సాగుతోంది. దాంతో హరీష్‌శంకర్ గురువారం సినిమా కబురు అంటూ ట్వీట్ చేయగానే, ‘రీమేక్ వద్దు’ అంటూ అభిమానులు పెద్దఎత్తున ప్రతిస్పందించారు. ‘మాకు తెరి రీమేక్ వద్దు’ అనే ట్యాగ్ ట్రెండింగ్ కూడా అయ్యింది. పవన్‌కల్యాణ్ కోసం హరీష్ శంకర్ కొత్త కథనే సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఈ నెలలోనే సినిమాని ప్రారంభించనున్నట్టు తెలిసింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
TTD APP: శ్రీవారి భక్తుల కోసం ఇకపై ‘టీటీ దేవస్థానమ్స్’ యాప్..
-
India News
India-Pakistan: సింధు జలాల ఒప్పందాన్ని మార్చుకుందాం.. పాక్‌కు భారత్ నోటీసు
-
Politics News
Yuvagalam: యువగళం పాదయాత్ర.. సొమ్మసిల్లిన సినీనటుడు తారకరత్న
-
Sports News
Axar Patel : ప్రియురాలిని వివాహమాడిన ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్..
-
India News
Pariksha Pe Charcha: విద్యార్థులతో ప్రధాని మోదీ ‘పరీక్షాపే చర్చ’