Hari Hara Veera Mallu: టీజర్‌ ఎప్పుడంటే?

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఎ.ఎం.రత్నం సమర్పణలో పాన్‌ ఇండియా చిత్రంగా ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌ కథానాయిక నటిస్తోంది. అయితే సినిమాకి సంబంధించి టీజర్‌ని పవన్ పుట్టినరోజు పురస్కరించుకొని సెప్టెంబర్‌ 2న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట చిత్రబృందం.

Updated : 24 May 2021 19:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్: పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్‌ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఎ.ఎం.రత్నం సమర్పణలో పాన్‌ ఇండియా చిత్రంగా ఎ.దయాకర్‌ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్‌ కథానాయిక. అయితే సినిమాకి సంబంధించి టీజర్‌ని పవన్ పుట్టినరోజు పురస్కరించుకొని సెప్టెంబర్‌ 2న విడుదల చేసే ఆలోచనలో ఉందట చిత్రబృందం. అదే విధంగా కథానాయిక నిధి అగర్వాల్‌కు సంబంధించి ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 17న ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని సైతం విడుదల చేయనున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొత్తం మీద ‘హరిహరి వీరమల్లు’కు సంబంధించి ఇప్పటికే విడుదలైన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ అభిమానులను ఆకట్టుకుంది. సినిమా షూటింగ్‌ ప్రారంభమై పదిహేను రోజులు షూటింగ్‌ కూడా జరుపుకొంది. తర్వాత కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

చిత్రానికి ‘ఆక్వామన్’, ‘వార్‌క్రాఫ్ట్’, ‘స్టార్ వార్స్: ది ఫోర్స్ అవేకెన్స్’ వంటి హాలీవుడ్‌ చిత్రాలకు గ్రాఫిక్ పనులు పర్యవేక్షించిన బెన్ లాక్ ఈ సినిమాకి VFX బాధ్యతలను చూస్తున్నారు. మొఘలులు, కుతుబ్ షాహిల నేపథ్యంగా ఈ సినిమా సాగుతుంది. బాలీవుడ్‌ స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ శ్యామ్‌ కౌశల్‌ నేతృత్యంలో ఆ మధ్య పవన్‌పై కొన్ని యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరించారు. అర్జున్‌ రాంపాల్‌, జాక్వెలైన్‌ ఫెర్నాండజ్‌, ఆదిత్య మేనన్‌ తదితరలు నటిస్తున్నారు. పూజిత పొన్నాడ ప్రత్యేక గీతంలో నటించనుంది. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండగ నాటికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని