Unstoppable 2: మీ ఎదురుచూపులకు తెరపడింది.. అన్‌స్టాపబుల్‌లోకి ‘పవర్‌’ఫుల్ ఎంట్రీ..

బాలకృష్ణ వ్యాఖ్యతగా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్‌-2(Unstoppable 2)కు పవన్‌ కల్యాణ్‌ గెస్ట్‌గా వచ్చారు. ఈ ఎపిసోడ్‌ చిత్రీకరణ ప్రారంభమైందని అల్లుఅరవింద్‌ తెలిపారు. 

Updated : 27 Dec 2022 15:34 IST

హైదరాబాద్‌: ‘అన్‌స్టాపబుల్‌’ మొదటి సీజన్‌ సూపర్‌ సక్సెస్ కావడంతో రెండో సీజన్‌(Unstoppable 2)ను మంచి జోష్‌ మీద కొనసాగిస్తున్నారు. సాధారణ ప్రేక్షకులనే కాదు సినీ ప్రముఖులనూ ఈ షో ఎంతగానో అలరిస్తోంది. ఇక ఈ కార్యక్రమంలో పవన్‌కల్యాణ్‌(Pawan Kalyan) ఎప్పుడు వస్తారా..? అని ఆయన అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఆ ఎదురుచూపులకు తెరపడింది. పవన్‌ అన్‌స్టాపబుల్‌-2(Unstoppable 2)లో పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ ఎపిసోడ్‌ షూటింగ్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా అల్లుఅరవింద్‌ మీడియాతో మాట్లాడారు.

‘అన్‌స్టాపబుల్‌లో మీరందరూ ఎవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆయన వచ్చేస్తున్నారు. ఈరోజు బిగ్గెస్ట్‌ అండ్‌ క్రేజీ ఎపిసోడ్‌ షూటింగ్‌ జరుగుతోంది. పవన్‌కల్యాణ్‌ ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. త్వరలోనే ఈ ఎపిసోడ్‌ మీ ముందుకు రానుంది’ అంటూ పవన్‌కు థ్యాంక్స్‌ చెప్పారు అల్లు అరవింద్‌. ఈ కార్యక్రమానికి పవన్‌ వస్తారన్నది రెండో ఎపిసోడ్‌లోనే అభిమానులకు అర్థమైంది. రెండో ఎపిసోడ్‌లో త్రివిక్రమ్‌కు ఫోన్‌ చేసిన బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్‌కు ఎప్పుడు వస్తున్నావు?, ఎవరితో రావాలో తెలుసుగా.!’ అని అనడంతో అది వైరల్‌ అయింది.

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పవన్‌ ‘హరి హర వీరమల్లు’లో (HariHara Veeramallu) నటిస్తున్నారు. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. అటు బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’గా సంక్రాంతికి అలరించేందుకు సిద్ధమయ్యారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని