Kalapuram: ‘కళాపురం’ టీజర్‌ విడుదల

‘పలాస’ చిత్రంతో తొలి  ప్రయత్నంలోనే విమర్శకుల   ప్రశంసలు దక్కించుకున్నారు దర్శకుడు కరుణ కుమార్‌. ఇప్పుడాయన నుంచి వస్తున్న కొత్త సినిమా ‘కళాపురం’. ఈ ఊరిలో అందరూ కళాకారులే.. అన్నది ఉపశీర్షిక. సత్యం రాజేష్‌, చిత్రం శ్రీను, రక్షిత్‌ అట్లూరి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్‌, ఆర్‌ 4ఎంటర్‌టైన్‌మెంట్స్‌

Updated : 13 Aug 2022 06:55 IST

‘పలాస’ (Palasa) చిత్రంతో తొలి ప్రయత్నంలోనే విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నారు దర్శకుడు కరుణ కుమార్‌ (Karan kumar). ఇప్పుడాయన నుంచి వస్తున్న కొత్త సినిమా ‘కళాపురం’ (kalapuram). ఈ ఊరిలో అందరూ కళాకారులే.. అన్నది ఉపశీర్షిక. సత్యం రాజేష్‌, చిత్రం శ్రీను, రక్షిత్‌ అట్లూరి తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. జీ స్టూడియోస్‌, ఆర్‌ 4ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతకాలపై రజనీ తాళ్లూరు నిర్మించారు. ఆగస్టు 26న విడుదల కానుంది. శుక్రవారం ఈ చిత్ర టీజర్‌ను హీరో పవన్‌ కల్యాణ్‌ విడుదల చేశారు. సినిమా తీయాలని కలలు కనే ఓ ఔత్సాహిక దర్శకుడి కథ ఇది. అతను ఓ నిర్మాతతో కలిసి సినిమా చేయాలనుకుంటారు. అయితే తాను ఉంటున్న కళాపురం గ్రామంలో కొంత సినిమా షూట్‌ చేయాలనే షరతు విధిస్తాడు నిర్మాత. అందుకు తగ్గట్లుగానే ఆ ఊరిలో చిత్రీకరణ మొదలు పెడతారు. కానీ, నిర్మాత వద్ద ఉన్న డబ్బు కోసం మధ్యలో పోలీసులు, రౌడీలు ఎంట్రీ ఇస్తారు. అలాంటి పరిస్థితుల్లో దర్శక నిర్మాతలు సినిమా ఎలా పూర్తి చేశారు? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన సవాళ్లేంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. మణిశర్మ స్వరాలందించారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని