Pawan Kalyan: ఇరవై ఏళ్ల బ్రేక్.. మళ్లీ మొదలు పెట్టిన పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్ షేర్ చేసిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఆయన ‘హరిహర వీరమల్లు’ సినిమాతో బిజీగా ఉన్నారు.
హైదరాబాద్: మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం ఉన్న తెలుగు హీరో ఎవరంటే? అందరూ చెప్పే సమాధానం పవన్ కల్యాణ్ (Pawan Kalyan). పలు చిత్రాల్లోనూ తన ప్రతిభను ప్రదర్శించారు. అదే ప్రధానాంశంగా ‘జాని’ సినిమాని తానే స్వయంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మార్షల్ ఆర్ట్స్‌కు దూరమైన పవన్ మళ్లీ ప్రాక్టీస్‌ను ప్రారంభించినట్టు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. సంబంధిత ఫొటో షేర్ చేస్తూ.. రెండు దశాబ్దాల తర్వాత మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్‌ని ప్రారంభించానని పేర్కొన్నారు. పవన్ ఫొటో పంచుకోవడమే ఆలస్యం ఆయన అభిమానులు దాన్ని క్షణాల్లోనే వైరల్ చేశారు. పవన్ కల్యాణ్ గతంలో మార్షల్ ఆర్ట్స్ గురించి చెప్పిన మాటలు, ఆయన చేసిన ప్రాక్టీస్‌ను గుర్తు చేసుకుంటున్నారు. ‘అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదన్నా నీ ఫైర్’, ‘వింటేజ్ లుక్’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
‘భీమ్లా నాయక్’తో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) సినిమాలో నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆ చిత్రంలోని పాత్ర కోసమే పవన్ మార్షల్ ఆర్ట్స్ సాధన చేస్తున్నారు. 17వ శతాబ్దంనాటి చారిత్రక నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయిక. ‘సాహో’ ఫేం సుజిత్ డైరెక్షన్‌లో పవన్ ఓ చిత్రం ఖరారు చేశారు. హరీశ్ శంకర్‌తో ఓ సినిమా చేయనున్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Djokovic: ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023.. జకోవిచ్ ఖాతాలో పదో టైటిల్.. మొత్తంగా 22వ గ్రాండ్‌స్లామ్
-
General News
Harish Rao: వైద్యరంగంలో మనం దేశానికే ఆదర్శం: హరీశ్‌రావు
-
General News
Srisailam: శ్రీశైలం ఘాట్రోడ్లో రక్షణ గోడను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తప్పిన పెను ప్రమాదం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Movies News
Chiranjeevi: జన్మజన్మలకు నీకే బిడ్డలుగా పుట్టాలని కోరుకుంటున్నాం..: చిరంజీవి
-
India News
PM Modi: బడ్జెట్ సమావేశాల వేళ.. మంత్రులతో ప్రధాని మోదీ కీలక భేటీ