Pawan Kalyan: పవర్‌స్టార్‌ - సుజిత్‌ సినిమా పోస్టర్‌.. డీ కోడ్‌ చేశారా..!

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా సుజిత్‌ దర్శకత్వంలో ఓ పవర్‌ఫుల్‌ చిత్రం తెరకెక్కనుంది. తాజాగా ఈసినిమా కాన్సెప్ట్‌ పోస్టర్‌ విడుదలైంది. ఆ పోస్టర్‌ని ఒక్కసారి చెక్‌ చేస్తే..

Updated : 04 Dec 2022 15:06 IST

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ (Pawankalyan), దర్శకుడు సుజిత్‌ (Sujeeth) కాంబినేషన్‌లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఆదివారం ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఓ కాన్సెప్ట్‌ పోస్టర్‌ సైతం విడుదలైంది. అయితే ఈ పోస్టర్‌ను ఆసక్తిగా తిలకిస్తే ఇందులో సినిమాకు సంబంధించిన పలు విషయాలను దర్శకుడు పొందుపరిచినట్లు అర్థమవుతుంది. ఇప్పుడు పవర్‌స్టార్‌ అభిమానులందరూ ఆ పోస్టర్‌లో దాగి ఉన్న విశేషాలను డీ కోడ్‌ చేసే పనిలో పడ్డారు. ఇంతకీ ఆ పోస్టర్‌ ఏం చెబుతుందో ఓ లుక్కేద్దాం..!

1. They Call Him #OG.. ఇక్కడ ఓజీ అంటే ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌. వాళ్లందరూ ఆయన్ని ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌ అని పిలుస్తుంటారని ఈ ట్యాగ్‌ లైన్‌ చెబుతోంది.

2. పోస్టర్‌లో పవన్‌కల్యాణ్‌ ఫొటోపై రాసి ఉన్న భాష.. జపానీస్‌. FirestormIsComing (అగ్నితుఫాన్‌ వస్తోంది) అని దాని అర్థం.

3. పవన్‌కల్యాణ్‌ నీడలో గన్‌ కనిపిస్తుంది.

4. పవన్‌కల్యాణ్‌ ముందు ఉన్న వృత్తాకారం.. జపాన్‌ జాతీయ జెండాను గుర్తు చేస్తుంది.

5. పోస్టర్‌లో ఓ వైపు విగ్రహం ఆకారం కనిపిస్తుంది. అది జపాన్‌లోనే అత్యంత ఎత్తైన బుద్ధుడి విగ్రహం. ఇది ఆ దేశంలోని ఉషికు ప్రాంతంలో ఉంది.

6. ఇక, పోస్టర్‌లో మరోవైపు చూస్తే మనదేశంలోని గేట్‌వే ఆఫ్‌ ఇండియా కనిపిస్తుంది.

పైన చెప్పిన వాటిని ఆధారంగా చూస్తే ఈ సినిమాలో పవర్‌స్టార్‌ గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కనిపించనున్నారని అర్థమవుతోంది. జపాన్‌, ముంబయి నేపథ్యంలో ఈ కథ సాగే అవకాశం ఉందని తెలుస్తోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపుదిద్దుకోనున్న ఈసినిమా కోసం సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌ వెచ్చించే అవకాశం ఉందని సమాచారం.

వైరల్‌గా మారిన సుజిత్‌ వీడియో..!

పవన్‌-సుజిత్‌ కాంబోలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సినిమా ప్రకటించడంతో సోషల్‌మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో పవన్‌కల్యాణ్‌కు వీరాభిమాని అయిన సుజిత్‌ ‘గబ్బర్‌సింగ్‌’ రిలీజ్‌ అయినప్పుడు ‘పవర్‌స్టార్‌ జిందాబాద్‌’ అని అరుస్తూ థియేటర్‌ నుంచి బయటకు వస్తూ కనిపించారు. ఈ వీడియో చూసిన పవన్‌ అభిమానులు.. ‘‘అన్నా సినిమా అదిరిపోవాలి’’ అని కామెంట్స్‌ చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని