Pawan Kalyan: పవర్‌స్టార్ - సుజిత్ సినిమా పోస్టర్.. డీ కోడ్ చేశారా..!
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో ఓ పవర్ఫుల్ చిత్రం తెరకెక్కనుంది. తాజాగా ఈసినిమా కాన్సెప్ట్ పోస్టర్ విడుదలైంది. ఆ పోస్టర్ని ఒక్కసారి చెక్ చేస్తే..
హైదరాబాద్: పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ (Pawankalyan), దర్శకుడు సుజిత్ (Sujeeth) కాంబినేషన్లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే. ఆదివారం ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఓ కాన్సెప్ట్ పోస్టర్ సైతం విడుదలైంది. అయితే ఈ పోస్టర్‌ను ఆసక్తిగా తిలకిస్తే ఇందులో సినిమాకు సంబంధించిన పలు విషయాలను దర్శకుడు పొందుపరిచినట్లు అర్థమవుతుంది. ఇప్పుడు పవర్‌స్టార్ అభిమానులందరూ ఆ పోస్టర్లో దాగి ఉన్న విశేషాలను డీ కోడ్ చేసే పనిలో పడ్డారు. ఇంతకీ ఆ పోస్టర్ ఏం చెబుతుందో ఓ లుక్కేద్దాం..!
1. They Call Him #OG.. ఇక్కడ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్. వాళ్లందరూ ఆయన్ని ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ అని పిలుస్తుంటారని ఈ ట్యాగ్ లైన్ చెబుతోంది.
2. పోస్టర్లో పవన్‌కల్యాణ్ ఫొటోపై రాసి ఉన్న భాష.. జపానీస్. FirestormIsComing (అగ్నితుఫాన్ వస్తోంది) అని దాని అర్థం.
3. పవన్‌కల్యాణ్ నీడలో గన్ కనిపిస్తుంది.
4. పవన్‌కల్యాణ్ ముందు ఉన్న వృత్తాకారం.. జపాన్ జాతీయ జెండాను గుర్తు చేస్తుంది.
5. పోస్టర్లో ఓ వైపు విగ్రహం ఆకారం కనిపిస్తుంది. అది జపాన్‌లోనే అత్యంత ఎత్తైన బుద్ధుడి విగ్రహం. ఇది ఆ దేశంలోని ఉషికు ప్రాంతంలో ఉంది.
6. ఇక, పోస్టర్లో మరోవైపు చూస్తే మనదేశంలోని గేట్‌వే ఆఫ్ ఇండియా కనిపిస్తుంది.
పైన చెప్పిన వాటిని ఆధారంగా చూస్తే ఈ సినిమాలో పవర్‌స్టార్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నారని అర్థమవుతోంది. జపాన్, ముంబయి నేపథ్యంలో ఈ కథ సాగే అవకాశం ఉందని తెలుస్తోంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రూపుదిద్దుకోనున్న ఈసినిమా కోసం సుమారు రూ.100 కోట్ల బడ్జెట్ వెచ్చించే అవకాశం ఉందని సమాచారం.
వైరల్‌గా మారిన సుజిత్ వీడియో..!
పవన్-సుజిత్ కాంబోలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సినిమా ప్రకటించడంతో సోషల్‌మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది. అందులో పవన్‌కల్యాణ్‌కు వీరాభిమాని అయిన సుజిత్ ‘గబ్బర్‌సింగ్’ రిలీజ్ అయినప్పుడు ‘పవర్‌స్టార్ జిందాబాద్’ అని అరుస్తూ థియేటర్ నుంచి బయటకు వస్తూ కనిపించారు. ఈ వీడియో చూసిన పవన్ అభిమానులు.. ‘‘అన్నా సినిమా అదిరిపోవాలి’’ అని కామెంట్స్ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ‘సూర్య44’.. అధికారికంగా ప్రకటించిన హీరో
ప్రముఖ కథానాయకుడు సూర్య తన 44వ చిత్రాన్ని సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్‌పై దిల్‌రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రికార్డు సృష్టించిన మలయాళ చిత్రం.. తెలుగు రిలీజ్ డేట్ ఫిక్స్
మలయాళ హిట్ చిత్రం ‘మంజుమ్మల్ బాయ్స్’ తెలుగులో విడుదల కానుంది. ఎప్పుడంటే? -
RC17: రామ్ చరణ్-సుకుమార్ సినిమాలో అదే హైలైట్: రాజమౌళి
రామ్ చరణ్-సుకుమార్ సినిమాపై రాజమౌళి కామెంట్స్ వీడియో వైరల్‌గా మారింది. ఓ సన్నివేశం గురించి ఆయన దానిలో వివరించారు. -
RC17: రామ్ చరణ్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మరోసారి రిపీట్ కానున్న హిట్ కాంబో
రామ్ చరణ్ కొత్త చిత్రం ప్రకటించారు. స్టార్ దర్శకుడితో కలిసి మరో ప్రాజెక్టుకు (#RC17) శ్రీకారం చుట్టారు. -
priyadarshi: ప్రియదర్శి- ఇంద్రగంటి కొత్త సినిమా ప్రారంభం
ప్రియదర్శి కొత్త సినిమా సోమవారం ప్రారంభమైంది. -
Kamal Haasan: మూడు చిత్రాల అప్డేట్స్ ఇచ్చిన కమల్ హాసన్.. ‘కల్కి’ గురించి ఏమన్నారంటే!
తాను నటిస్తోన్న సినిమాల అప్డేట్లను కమల్ హాసన్ పంచుకున్నారు. -
upcoming movies: ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
upcoming movies: మార్చి ఆఖరి వారంలో అటు థియేటర్లో పాటు, ఇటు ఓటీటీలో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి చిత్రాలు సిద్ధమవుతున్నాయి. -
War 2: వార్2లో కంపోజర్ ప్రీతమ్ భాగం కానున్నారా?
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న చిత్రానికి ప్రీతమ్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. -
Double Ismart Movie Update: ‘డబుల్ ఇస్మార్ట్’ రిలీజ్‌పై రామ్ కామెంట్స్.. ఏమన్నారంటే!
‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) రిలీజ్ డేట్‌పై రామ్ కామెంట్ చేశారు. -
Kalki 2898AD: ‘కల్కి 2898 ఏడీ’.. స్వప్నదత్ ఆసక్తికర కామెంట్స్
ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘కల్కి 2898 ఏడీ’పై నిర్మాత స్వప్న ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
Devara: ‘దేవర’లో మరాఠీ బ్యూటీ.. తన పాత్ర ఏంటో చెప్పేసిన నటి!
ఎన్టీఆర్ సరసన నటిస్తున్నట్లు మరాఠీ బ్యూటీ శ్రుతి వెల్లడించారు. -
SSMB29: మహేశ్-రాజమౌళి సినిమాపై అంచనాలు పెంచేసిన కార్తికేయ.. ఏమన్నారంటే!
రాజమౌళి-మహేశ్ సినిమాపై ఎస్ఎస్ కార్తికేయ కామెంట్ చేశారు. -
Shiva Rajkumar: ఇది మరో స్థాయిలో ఉంటుంది: రామ్ చరణ్ చిత్రంపై శివ రాజ్‌కుమార్
హీరో రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబుపై కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ ప్రశంసలు కురిపించారు. -
Prithviraj Sukumaran: 72 గంటల పాటు కేవలం నీళ్లు.. బ్లాక్ కాఫీ మాత్రమే తాగా: పృథ్వీరాజ్
Aadujeevitham: పృథ్వీరాజ్ కీలక పాత్రలో నటించిన ‘ఆడుజీవితం’ షూటింగ్ విశేషాలను ఆయన పంచుకున్నారు. -
Pushpa2: ‘పుష్ప2’ షూటింగ్ అప్డేట్ ఇచ్చిన రష్మిక..ఫొటో వైరల్
‘పుష్ప2’ షూటింగ్ ప్రస్తుతం యాగంటిలో జరుగుతున్నట్లు రష్మిక తెలిపారు. -
Dhanush: అందుకు నేను గర్వపడుతున్నా: ధనుష్
మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా(Ilaiyaraaja) జీవితాన్ని ఆధారంగా చేసుకుని కోలీవుడ్‌లో ఓ సినిమా రానుంది. బుధవారం నుంచి ఇది పట్టాలెక్కింది. -
RamCharan: అట్టహాసంగా రామ్‌చరణ్ కొత్త సినిమా ప్రారంభం
రామ్‌చరణ్ (Ram Charan) కొత్త సినిమా అట్టహాసంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
Manjummel Boys: ‘మంజుమ్మెల్ బాయ్స్’ సరికొత్త రికార్డు.. ఆ విషయంలో తొలి మలయాళ సినిమా
మలయాళ చిత్ర పరిశ్రమలో ‘మంజుమ్మెల్ బాయ్స్’ రికార్డు సృష్టించింది. అదేంటంటే?
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్‌కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్