Published : 02 Sep 2021 18:43 IST

Pawan kalyan: 550 రూబిక్స్‌ క్యూబ్స్‌తో పవన్‌ చిత్రం తీర్చిదిద్దారిలా!

హైదరాబాద్‌: అగ్ర కథానాయకుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సినీ ప్రముఖులు, అభిమానులు, జనసేన కార్యకర్తలు ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో తమ ప్రియతమ నాయకుడు, కథానాయకుడిగా శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆ క్రమంలో కడప నగరానికి చెందిన యువ ఇంజనీరు నరసింహ శ్రీచరణ్.. పవన్‌కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలనుకున్నారు. రూబిక్స్‌ క్యూబ్స్‌తో వివిధ ఆకృతులు తయారు చేయడం శ్రీచరణ్‌కు అలవాటు. వాటితోనే పవన్‌ చిత్రం గీయాలనుకున్నాడు. అలా 550 రూబిక్ క్యూబ్స్‌ను ఉపయోగించి, దాదాపు 24గంటలకు పైగా శ్రమించి పవన్‌ చిత్రాన్ని తీర్చిదిద్దారు. శ్రీచరణ్‌ ప్రయత్నానికి సామాజిక మాధ్యమాల వేదికగా అభినందనలు వస్తున్నాయి. జనసేన పార్టీ కూడా శ్రీచరణ్‌కు కృతజ్ఞలు చెప్పింది. మరి పవన్‌ చిత్రాన్ని శ్రీచరణ్‌ ఎలా రూపొందించాడో మీరూ చూసేయండి.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని