Pawan Kalyan: ఇప్పుడు నా బాధ్యత మరింత పెరిగింది: పవన్‌ కల్యాణ్‌

డిప్యూటీ సీఎం అయ్యాక మొదటిసారి పవన్‌ ఇన్‌స్టాలో వీడియో పెట్టారు. దీనిపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు.

Published : 20 Jun 2024 13:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో కూటమి ఘనవిజయాన్ని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ఇక ఏపీ ఉప ముఖ్యమంత్రిగా జనసేనాని పవన్‌కల్యాణ్ తాజాగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా ఆయన బాధ్యత స్వీకరించిన అనంతరం తన ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను పవన్‌ షేర్ చేశారు. తన బాధ్యత మరింత పెరిగిందన్నారు.

చాలా అరుదుగా పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) తన ఇన్‌స్టాలో పోస్ట్‌ పెడుతుంటారు. దీంతో ఆయన తాజాగా పంచుకున్న వీడియో వైరల్‌గా మారింది. ‘ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం గౌరవంగా ఉంది. ఇప్పుడు నా బాధ్యత మరింత పెరిగింది. రాష్ట్రానికి అంకితభావంతో, చిత్తశుద్ధితో సేవ చేయడానికి కట్టుబడి ఉన్నాను. ప్రతి ఒక్కరికీ సంపన్నమైన, సుస్థిరమైన భవిష్యత్తును అందించాలని ఆసక్తిగా ఉన్నాను’ అని పేర్కొన్నారు. 

ఇక పవన్‌ షేర్‌ చేసిన వీడియోలో ఆయన (Pawan Kalyan) మంగళగిరి పార్టీ ఆఫీసు నుంచి బయలుదేరి తన ఛాంబర్‌కు వచ్చి పూజలు నిర్వహించడం చూపించారు. ఫైల్స్‌ మీద సంతకాలు చేయడంతో పాటు పలువురు అధికారులకు ఆయన అభివాదం చేయడం చూపించారు. ఈ వీడియోపై సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. శుభాకాంక్షలు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు