Published : 24 May 2022 17:22 IST

Akira Nandan: ‘దోస్తీ’ సాంగ్‌తో ఫిదా చేస్తున్న పవన్‌కల్యాణ్‌ తనయుడు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) తనయుడు అకీరా నందన్‌ (Akira Nandan)పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాను పీయోనో ప్లే చేసే విధానానికి అంతా ఫిదా అవుతున్నారు. తమ స్కూల్‌లో సోమవారం నిర్వహించిన ఫేర్‌వెల్‌ పార్టీ (గ్రాడ్యుయేషన్‌ డే)లో అకీరా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) చిత్రంలోని ‘దోస్తీ’ (Dosti) గీతాన్ని పియోనోతో ప్లే చేశాడు. తన స్నేహితులు, పాఠశాల యాజమాన్యాన్ని అలరించాడు. సంబంధిత వీడియోను తన తల్లి రేణు దేశాయ్‌ (Renu Desai) సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు. తనయుడి ప్రతిభను కీర్తిస్తూ పోస్ట్‌ పెట్టారు. అకీరా ఎదుగుదలపై ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు, ఈ వేడుకకు అకీరా తండ్రి పవన్‌కల్యాణ్‌ సైతం హాజరయ్యారు. ఆ ఈవెంట్‌లో కొడుకు అకీరా, కుమార్తె ఆద్యతోపాటు పవన్‌కల్యాణ్‌తో కలిసి దిగిన ఫొటోను రేణు సోషల్‌ మీడియాలో పంచుకోగా కొన్ని క్షణాల్లోనే వైరల్‌గా మారింది. చాలాకాలం తర్వాత పవన్‌- రేణు ఒకే వేదికపై కనిపించడంతో తమ అభిమానులు ఖుషీ అవుతున్నారు. అకీరాకు కర్రసాము, బాక్సింగ్‌లోనూ ప్రావీణ్యం ఉన్న సంగతి తెలిసిందే. 




Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని