pawan kalyan: ఆ రీమేక్‌ మరింత ఆలస్యం.. కారణం అదేనా?

ఇటు రాజకీయాలు, అటు సినిమాలతో తీరికలేకుండా ఉన్నారు అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan).

Published : 18 Jul 2022 01:42 IST

హైదరాబాద్‌: ఇటు రాజకీయాలు, అటు సినిమాలతో తీరికలేకుండా ఉన్నారు అగ్ర కథానాయకుడు పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan). ప్రస్తుతం ఆయన క్రిష్‌ దర్శకత్వంలో ‘హరిహర వీరమల్లు’లో నటిస్తున్నారు. దీని తర్వాత హరీశ్‌ శంకర్‌తో ‘భవదీయుడు భగత్‌ సింగ్‌’ చేయాల్సి ఉంది. అయితే, మధ్యలో ‘వినోదయసిత్తం’ రీమేక్‌లో నటించేందుకు పవన్‌ పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం పవన్‌ జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ‘జనవాణి- జనసేన భరోసా’ పేరుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్వయంగా వింటున్నారు. మధ్యలో ఖాళీ దొరికినప్పుడల్లా ‘హరిహర వీరమల్లు’ షూట్స్‌లో పాల్గొంటున్నారు. దీంతో ‘వినోదయసిత్తం’ మరింత ఆలస్యం కానుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. తొలుత అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం పవన్‌ ఈ రీమేక్‌ సెట్స్‌లో అడుగు పెట్టాల్సి ఉంది. వరుస రాజకీయ కార్యక్రమాల కారణంగా అదంతా రీషెడ్యూల్‌ అయింది. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు బుర్రాసాయి మాధవ్‌ మాటలు అందిస్తున్నారు. సాయిధరమ్‌ తేజ్‌ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని