Hari Hara Veera Mallu: కళాత్మక స్వాగతం

కళా దర్శకుడు తోట తరణి రూపొందించే సెట్స్‌ సృజనాత్మక శక్తికీ... అధ్యయన అభిలాషకీ అద్దం పడతాయన్నారు ప్రముఖ కథానాయకుడు పవన్‌కల్యాణ్‌. ఆయన కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో తెర

Updated : 09 Apr 2022 08:51 IST

కళా దర్శకుడు తోట తరణి రూపొందించే సెట్స్‌ సృజనాత్మక శక్తికీ... అధ్యయన అభిలాషకీ అద్దం పడతాయన్నారు ప్రముఖ కథానాయకుడు పవన్‌కల్యాణ్‌. ఆయన కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో తెర కెక్కుతున్న ‘హరి హర వీరమల్లు’ సినిమాకి తోట తరణి కళా దర్శకుడిగా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల మొదలైన సినిమా కొత్త షెడ్యూల్‌ కోసం తోట తరణి నేతృత్వంలో పలు సెట్స్‌ని తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా సెట్స్‌కి వచ్చిన తోట తరణికి పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు  పవన్‌కల్యాణ్‌. ఆయనతో చెన్నైలో ఉన్నప్పట్నుంచి పరిచయం ఉందనీ, ఆయన నేతృత్వంలో తన సినిమా సెట్స్‌ రూపుదిద్దుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు. ఆయనతో పాటు, దర్శకుడు క్రిష్‌, నిర్మాత ఏఎం రత్నం ఉన్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని